Prabhas

Prabhas: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం మోస్ట్ బ్యాచిలర్ ఎవరు అంటే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చే పేరు రెబల్ స్టార్ ప్రభాస్.ఆయన నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు తెచ్చుకొని వరుసగా పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్నారు. ఇక బాహుబలి-2 సినిమా తర్వాత ఈయన నటించిన రెండు పాన్ ఇండియా సినిమాలు ప్లాప్ అయినప్పటికీ కూడా ఈయన అభిమానుల్లో మాత్రం ఈయనకు ఏ మాత్రం క్రేజ్ తగ్గలేదు.

అయితే చాలామంది ప్రభాస్ (Prabhas) అభిమానులతో పాటు ఇండస్ట్రీ జనాలు కూడా ప్రభాస్ గురించి ఒకే విషయంలో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే ప్రభాస్ పెళ్లి.అయితే ప్రభాస్ అభిమానులు మాత్రం ఆయన పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతారా అని చాలామంది ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ తన పెళ్లికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్ చెప్పారు. విషయంలోకి వెళ్తే.. నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా చేసే అన్ స్టాపబుల్- 2  (Unstopabul-2) సీజన్ కి ప్రభాస్ అలాగే గోపీచంద్ ఇద్దరు హాజరైనట్టు ఆహా వాళ్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో అఫీషియల్ రిలీజ్ చేశారు.

    Click here for follow Pakkafilmy in Google news

ఇక ఈ షో కి ప్రభాస్ (Prabhas) చాలా సింపుల్ గా వచ్చారు. అయితే వీరు మాట్లాడుకున్న ప్రోమో ఏ ఒక్కటి కూడా బయటికి రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం వీరు ఇవే విషయాలు మాట్లాడుకున్నారు అంటూ ఓ వార్త చాలా ట్రెండింగ్ అవుతుంది. అదేంటంటే..బాలకృష్ణ ప్రభాస్ ని నేరుగా నువ్వు అనుష్క (Anushka) ని పెళ్లి చేసుకుంటావంట కదా నిజమేనా అంటూ డైరెక్ట్ గా అడిగారట. అయితే ఈ ప్రశ్నకు ప్రభాస్ ఏం మాట్లాడాలో తెలియక సిగ్గుపడుతూ మా మధ్యన అలాంటిది ఏమీ లేదు సార్ అవన్నీ ఏవో చెత్త న్యూస్ అలాగే వస్తూ ఉంటాయి అంటూ ఖండించారట. అలాగే నేను త్వరలోనే పెళ్లి చేసుకుంటాను.

అంతేకాదు ఈ విషయాన్ని అందరికీ అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాను..అంటూ ప్రభాస్ చెప్పారట. దీనికి బాలకృష్ణ (Balakrishna) సైతం సంతోషపడి నీ పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ నా షోలో చెప్పడం నాకు చాలా హ్యాపీగా ఉంది అంటూ మాట్లాడారని ప్రస్తుతం ఓ వార్త నెట్టింట్లో లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇందులో ఏ మాత్రం నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇక ఇందులో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటే కచ్చితంగా ఎపిసోడ్ చూడాల్సిందే.

Click here for follow Pakkafilmy in google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *