Jacqueline FernandezJacqueline Fernandez : బాలీవుడ్ ముద్దుగుమ్మ జాక్వలిన్ మరో కేసులో ఇరుక్కుంది. ఇప్పటికే ఆమె మనీ లాండరింగ్ కేసులో ఇరుక్కున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈడీ ఈ విషయాన్నీ చెప్పింది. ఈ కేసులో నిందితురాలిగా ఆమెను ఏక్యూజ్ చేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఆర్థిక నేరస్థుడుగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ (Sukhesh Chandrashekhar) ప్రధాన నిందితుడిగా ఉండగా ఈ కేసులో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ ఇరుక్కోవడం ఇప్పుడు అంతటా చర్చనీయాంశం అయ్యింది.

ఆమెపేరును ఛార్జ్ షీట్ లో కూడా పేర్కొన్నట్లు ఈడీ పేర్కొంది. అయితే ఈ కేసునుంచి ఎలా బయట పడాలో తెలియక ముప్పుతిప్పలు పడుతున్న జాక్వలిన్ ఇప్పుడు తాజాగా మరో షాక్ తగిలింది. ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఆమె పై కేసు నమోదు చేసింది. ఈ మనీ లాండరింగ్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా నా ప్రస్తావన తీసుకురావడం బాధగా ఉందని బాలీవుడ్ నటి నోరా ఫతేహి (Nora Fatehi) పేర్కొంది.

Click here for follow Pakkafilmy in Google news

విచారణ లో తన పేరును జాక్వలిన్ చెప్పడంతో ఆమెను కూడా విచారించబోతున్నారని వార్తలు వచ్చాయి. ఆర్థిక నేరస్థుడు సుఖేష్ నోరా తో పాటు కొంతమంది హీరోయిన్ లకు బహుమతులు పంపించాడని ఆమె చెప్పిందట. సుఖేష్ వారందరితో పటు నోరా కూడా ఎంతో క్లోజ్ అని చెప్పిందట. దాంతో ఆమె జాక్వలిన్ పై మండిపడింది.

ఆమెతో పాటు 15 మీడియా సంస్థలపై కూడా ఆమె కేసు పెట్టినట్లు తెలుస్తుంది. తనను మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఇబ్బంది పెట్టేందుకు ఇలాంటివి చేస్తున్నారని ఆమె చెప్పింది. అసలు తనకు సుఖేష్ కి పరిచయమే లేదని ఆమె పేర్కొంది. తనపై బురదజల్లాలని ఇలా చేస్తున్నారని ఆమె చెప్పింది. ఇక ఈ విషయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి. జాక్వలిన్ (Jacqueline Fernandez) ఈ కేసునుంచి ఎలా బయటపడుతుందో మరీ.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *