న్యాచురల్ స్టార్ నాని(Nani) సోదరి దీప్తి గంటా ఇటీవ‌ల `మీట్ క్యూట్` అనే వెబ్ సిరీస్ తో డైరెక్టర్ గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. నాని సమర్పణలో ప్రశాంత్ త్రిపిర్నేని నిర్మించిన ఈ సిరీస్ సోని లివ్ లో స్ట్రీమింగ్ అయింది. అదా శర్మ, వర్ష బల్లమ్మ, శ్రీదివ్య, సమీర్, అశ్విన్ కుమార్, సత్యరాజ్‌, రుహాని శర్మ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషించారు. ఐదు క‌థ‌ల ఆంథాల‌జీగా రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ నవంబర్ 25న ఓటీటీలో స్ట్రీమింగ్ అవ్వ‌గా.. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

అయితే ఈ సిరీస్ విడుదల తర్వాత దీప్తిని కొందరు నెటిజ‌న్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. నానికి సోదరి కావడం వల్లే నువ్వు సులభంగా దర్శకరాలు అయ్యావ‌ని.. నాని లేకపోతే నువ్వు లేవ‌ని సోషల్ మీడియా ద్వారా కొందరు దీప్తిని వేధిస్తున్నారు. అలాగే నాని కూడా నెపోటిజంని సపోర్ట్ చేస్తున్నాడని విమర్శలు గుప్పిస్తున్నారు అయితే తాజాగా ఈ కామెంట్స్‌ పట్ల దీప్తి గంటా(deepthi ganta) స్పందిస్తూ భావోద్వేగానికి గురైంది.

`చాలా మంది నన్ను నెపోటిజం అని, నాని ఉన్నాడు కాబట్టే నేను దర్శకురాలిని అయ్యానని అంటున్నారు. చిన్నప్పటినుంచి మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగాం. మేమిద్దరం లైఫ్ మీద చాలా కలలు కన్నాం. దాని కోసం కష్టపడ్డాం. నేను కథలు రాస్తాను. అలాగే ఈ కథ కూడా రాశాను. నాని(nani)కి నచ్చి తానే ఎంకరేజ్ చేసి నాతో పూర్తి కథ సిద్ధం చేయించాడు. తానే నిర్మాత అవుతానని చెప్పాడు. డైరెక్టర్ గా కూడా మారమని ప్రోత్సహించి సపోర్ట్ చేశాడు.

Click here for follow Pakkafilmy in Google news

అవును నా నాని వల్లే నేను డైరెక్టర్ అయ్యాను. ఇందుకు నేను చాలా సంతోషంగా, గౌర్వంగా ఉన్నాను. ఈ సిరీస్ బయటకి రావడానికి కూడా కారణం నానినే. మీట్ క్యూట్(meet cute) కి మంచి స్పందన వచ్చాక నాకంటే నానినే ఎక్కువ సంతోషంగా ఫీల్ అయ్యాడు` అంటూ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా దీప్తి టోర్ల‌ర్స్‌కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్ ఇచ్చింది. దీంతో దీప్తి ఇన్‌స్టా పోస్ట్ కాస్త వైర‌ల్ గా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *