నభా నటేష్.. ఈ అందాల భామ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడలో సినీ కెరీర్ ప్రారంభించిన ఈ బ్యూటీ `నన్ను దోచుకుందువటే` అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ త‌ర్వాత రవిబాబు తెరకెక్కించిన `అదుగో` సినిమాలో మెరిసిన నభా నటేష్.. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో వచ్చిన `ఇస్మార్ట్ శంకర్`(ismart shankar) సినిమాతో తొలి హిట్ ను ఖాతాలో వేసుకుంది.

2019లో విడుదలైన ఈ చిత్రం ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేసిందో తెలిసిందే. ఈ మూవీతో అటు రామ్‌, ఇటు పూరి ఇద్ద‌రూ మంచి కంబ్యాక్ ఇచ్చారు. అలాగే ఈ సినిమాలో ఇస్మార్ట్ పోరిగా నటన పరంగానే కాకుండా గ్లామర్ పరంగానూ న‌భా న‌టేష్‌(Nabha Natesh)కు విమ‌ర్శ‌కుల‌ నుంచి ప్రశంసలు ద‌క్కాయి. ఈ సినిమా తర్వాత న‌భా దశ తిరిగిందని అందరూ అనుకున్నారు. ఆఫర్లు కూడా బాగానే వచ్చాయి.

`ఇస్మార్ట్ శంకర్` అనంతరం మాస్ మహారాజా రవితేజ(ravi teja)కు జోడీగా `డిస్కో రాజా`, సాయి ధరమ్ తేజ్ తో `సోలో బ్రతుకే సో బెటర్`, నితిన్ స‌రస‌న `మాస్ట్రో`, బెల్లంకొండ శ్రీనివాస్ తో `అల్లుడు అదుర్స్` చిత్రాలు చేసింది. కానీ వీటిల్లో ఏ ఒక్క చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించలేదు. వ‌రుస ఫ్లాపుల నేపథ్యంలో న‌భా న‌టేష్ గ్రాఫ్ క్రమంగా డౌన్ అయిపోయింది. దీంతో ఆఫర్ల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోతకు తెర‌లేపింది. తాను ఇంకా ఫామ్ లోనే ఉన్నానని చెప్ప‌డానికి హాట్ హాట్ ఫోటోషాట్లతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది.

Click here for follow Pakkafilmy in Google news

అయితే ఎంత చూపించిన ఈ అమ్మడికి ఆఫర్లు మాత్రం రావడం లేదు. ప్ర‌స్తుతం ఈ బ్యూటీ చేతిలో ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. దీంతో ప‌లువురు నెటిజ‌న్లు న‌భా న‌టేష్‌కు ఇక పెళ్లే గ‌తి అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఎలాగో వయసు మూడు పదులకు చేరువ‌వుతుంది. ఆఫర్లు చూస్తే నిల్ . కెరీర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఈ నేపథ్యంలోనే సినిమాలను పక్కన పెట్టి పెళ్లి(marriage) చేసుకుని సెటిల్ అవడం బెటర్ అని పలువురు నెటిజ‌న్లు సోషల్ మీడియా వేదికగా న‌భాకు సూచిస్తున్నారు. మరి ఈ బ్యూటీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *