Mahesh Babu-Allu Arjun

Mahesh Babu-Allu Arjun: సాధారణంగా చాలామంది హీరోల అభిమానుల మధ్య ఎప్పుడూ ఏదో ఒక విషయంపై గొడవ జరుగుతూనే ఉంటుంది. ఇక కొంతమంది అభిమానులైతే హీరోల విషయంలో కొట్టుకునే వరకు వెళ్తారు. కానీ హీరోలు మాత్రం ఏదైనా ఈవెంట్ అయితే పక్కపక్కనే కూర్చుని నవ్వుకుంటూ మాట్లాడుకుంటారు. అయితే వీళ్ళు అలా ఈవెంట్ వరకే మాట్లాడుకుంటారా లేదా నిజంగానే అలా మాట్లాడుకుంటారా అని చాలామంది అభిమానుల్లో ఒక అనుమానం ఉంటుంది. కానీ అభిమానులు మాత్రం చిన్న పాయింట్ ని మా హీరో ని తక్కువ చేస్తారా అంటే మా హీరోని తక్కువ చేస్తారా అంటూ కొట్టుకునే వరకు వెళ్తారు.

ఇక ఈ విషయంలో ఆ గొడవలు సర్దుమనగాలంటే హీరోలు ఎంటర్ అవ్వాల్సిందే. తాజాగా ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ కూతురు రిసెప్షన్ కి హాజరయ్యారు మహేష్ బాబు అల్లు అర్జున్ (Mahesh Babu-Allu Arjun). అయితే అల్లు అర్జున్ కన్నా ముందే మహేష్ బాబు వేదికపై ఉన్నాడు. ఇక అదే టైంలో అల్లు అర్జున్ కూడా రావడంతో మహేష్ బాబు పక్కన ఉండగానే అల్లు అర్జున్ ని కూడా స్టేజ్ మీదికి పిలిచాడు గుణశేఖర్. కానీ అదే టైంలో స్టేజ్ మీద మహేష్ బాబు ఉండడం చూసి అల్లు అర్జున్ కి కాస్త ఇన్ సెక్యూరిటీగా ఫీల్ అయినట్లు కనబడుతోంది.

    Click here for follow Pakkafilmy in Google news

అయితే అల్లు అర్జున్ మహేష్ బాబు అభిమానుల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా ఎప్పుడు ఏదో ఒక విషయంలో గొడవ పడుతూనే ఉంటారు. అయితే తాజాగా మహేష్ బాబు ( Mahesh babu) అల్లు అర్జున్ ఇద్దరు గుణశేఖర్ (guna shekhar) కూతురు పెళ్లిలో నవ్వుకుంటూ షేక్హ్యాండ్ ఇచ్చుకున్నారు. కానీ అది ఫోటో మట్టుకు మాత్రమే. ఆ తర్వాత స్టేజ్ దిగాక కనీసం పలకరించుకోకుండా ఎవరి దారిన వారు వెళ్లారు. అయితే సాధారణంగా హీరోలు ఎవరైనా ఏదైనా ఈవెంట్ కి గాని వేరే ఇతర ఏదైనా ఫంక్షన్లకు గాని హాజరైనప్పుడు ఇద్దరు ఒకే దగ్గరికి వస్తే ఓ హగ్గిచ్చుకొని కనీసం రెండు నిమిషాలు మాట్లాడుకుంటారు.

కానీ అల్లు అర్జున్ మహేష్ బాబు (Mahesh Babu-Allu Arjun) ఇద్దరూ గుణశేఖర్ గారి కూతురు పెళ్లిలో కనీసం ఒక నిమిషం కూడా మాట్లాడుకోకుండా కేవలం షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు.ఇక ఈ టాపిక్ వల్ల మరొకసారి వీరి మధ్య ఉన్న గొడవలు బయటపడ్డాయి. అంతేకాదు ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరి గొడవనే హాట్ టాపిక్ అవుతుంది. దాంతో సోషల్ మీడియా వేదికగా మరొకసారి అల్లు అర్జున్ మహేష్ బాబు అభిమానులు రెచ్చిపోయి ఒకరి మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇక ఈ విషయంలో మహేష్ బాబు అల్లు అర్జున్ ఏ విధంగా క్లారిటీ ఇస్తారో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *