KrishnaKrishna.. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మరణం వారి కుటుంబాలకు మాత్రమే కాదు సినీ పరిశ్రమ కి కూడా తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఆయన చనిపోయిన రోజు నుంచి నేటి వరకు కృష్ణకు సంబంధించిన ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలోని ఇప్పుడు కృష్ణకు సంబంధించిన మరొక వార్త కూడా సోషల్ మీడియాలో మరో మారు కనిపిస్తూ ఉండడం గమనార్హం.. అసలు విషయం ఏమిటంటే.. సూపర్ స్టార్ కృష్ణ కన్న కొడుకును కాదని.. రెండవ భార్య విజయనిర్మల కొడుకు నరేష్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే ఎందుకు అనేది ఇప్పుడు వైరల్ గా మారింది..

ఇకపోతే విజయనిర్మల చనిపోయిన తర్వాత తనతో ఎలాంటి సంబంధం లేని నరేష్ కుటుంబంతో ఉంటున్నారు అనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అయితే ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. కన్న కొడుకు మహేష్ బాబు కాకుండా నరేష్ కి అంత ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాన్ని ఆయన వెల్లడించారు. నరేష్ అంటే తనకు చాలా ఇష్టం అని.. తనకు ఎలాంటి అవసరం వచ్చిన సరే క్షణాల్లో అది చేసి పెట్టేది కేవలం నరేష్ మాత్రమే అని వెల్లడించారు. అంతేకాదు ఎప్పుడూ తన గురించి ఆలోచిస్తూ ఉంటాడని.. ఫోన్ చేయగానే పరిగెత్తుకుంటూ వస్తాడని.. అందుకే నరేష్ అంటే తనకు చాలా ఇష్టం అని కూడా కృష్ణ తెలిపారు.

    Click here for follow Pakkafilmy in Google news

మహేష్ బాబు సూపర్ స్టార్ గా బిజీ అయిపోయాక అతనికి సంబంధించిన ప్రతి పని నమ్రత చూసుకుంటుంది. తాను కూడా ఆమెకు భారంగా ఉండకూడదు అని అందుకోసమే విజయనిర్మల మరణించిన తర్వాత కూడా నరేష్ దగ్గరే ఉండిపోయాను అని కృష్ణ తెలిపినట్లు సమాచారం. ఇక నరేష్ విషయానికి వస్తే.. ఆయన తన పేరులో కూడా నరేష్ విజయ్ కృష్ణ అంటూ వీకే నరేష్ గా జత చేసుకున్న విషయం తెలిసిందే. చాలామంది మహేష్ బాబు పైన ప్రేమతో నరేష్ ను ఇష్టపడరు.. కానీ విజయ నిర్మల చనిపోయేవరకు కృష్ణ అంటే ఎంతో ప్రేమగా గౌరవంగా చూసుకునేవారు.. అయితే అదే ప్రేమ, గౌరవం కృష్ణకు ఆమె పోయాక నరేష్ అందిస్తూ వచ్చాడు..

ఆమె లేని లోటు తెలియకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఒంటరితనం అతడిని బాధ పెడుతున్నప్పటికీ.. నరేష్ చేయాల్సినంత చేసాడు. అందుకే మహేష్ బాబు కంటే నరేష్ అంటేనే కృష్ణకు చాలా ఇష్టం.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *