Bigboss7Bigboss7.. బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ షో కి అభిమానులు ఉన్నారు.ముఖ్యంగా ఈ షో ఇండియాలో ప్రముఖ భాషల్లో ఎన్నో సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాదు అన్ని చోట్ల ఎన్నో సీసన్ లు భారీ ప్రేక్షకాదరణ పొందాయి. ఈ క్రమంలోనే ఈ షో మన తెలుగులో కూడా ప్రసారమయ్యి చాలా పాపులర్ అయింది. ఇకపోతే తెలుగులో ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఈ షో మీద ఎలాంటి అంచనాలు లేవు .

కానీ మొదలయ్యాక వన్ వీక్ తర్వాత ఈ షో ఒక రేంజ్ లో పాపులర్ అయ్యింది.ఒక రకంగా చెప్పాలంటే తెలుగులో ఈ షో బాగా పాపులారిటీ దక్కించుకోవడానికి కారణం ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇప్పటికే ఐదు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో ఈ వారంతో ఆరవ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. ఇకపోతే మొదటి సీజన్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా చేయగా రెండవ సీజన్ కి నాచురల్ స్టార్ నాని హోస్ట్గా చేశారు.

ఆ తర్వాత మూడవ సీజన్ నుంచి ఇప్పుడున్న ఆరవ సీజన్ వరకు కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే బిగ్ బాస్ వరసగా నాగార్జునను హోస్ట్ గా కొనసాగిస్తే ప్రేక్షకులు ఇంట్రెస్ట్ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఇది ఇప్పుడు ఆరవ సీజన్లో జరుగుతోందని చెప్పవచ్చు. అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు వచ్చే ఏడవ సీజన్ కోసం సరికొత్త హోస్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Click here for follow Pakkafilmy in Google news

అయితే ఈ బిగ్ బాస్ 7 వ సీజన్ కూడా వచ్చే ఏడాది మధ్యలో ఈ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పటినుండి ఈ సీజన్ కోసం బిగ్ బాస్ టీం కొత్త హోస్టును వెతుకుతున్నారని అది కూడా టాలీవుడ్ కి చెందిన ఒక యువ హీరోని ఈసారి హోస్ట్ గా తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఈసారి ఏ హీరో హోస్ట్ గా రాబోతున్నారు అనే అంశం ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *