BB Cafe

BB Cafe: బిగ్ బాస్ సీజన్ 6(Biggboss 6) లో 14వ వారం అనూహ్యంగా ఇనయా సుల్తానా (inaya sultana) ఎలిమినేట్ కావడాన్ని చాలామంది నెటిజన్స్ తప్పు పడుతున్నారు. అంతేకాదు రేవంత్ కు గట్టి పోటీ ఇచ్చి టైటిల్ రేసులో ఉండాల్సిన ఇనయా ను ఎందుకు హౌస్ నుండి బయటికి పంపించారు అంటూ ఇప్పటికే చాలామంది బిగ్ బాస్ యాజమాన్యాన్ని విమర్శించారు. కావాలనే ఇనయాకి ఓట్లు పడ్డా కూడా ఆమెను బయటకు పంపించి ఏమాత్రం ఆటరాని కీర్తి భట్,శ్రీ సత్య లను హౌస్ లో ఉంచారు అంటూ చాలామంది విమర్శించారు.

ఈ విషయం పక్కన పెడితే హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాక ప్రతి ఒక్కరూ యాంకర్ శివ ఇంటర్వ్యూ చేసే బి బి కేఫ్ (BB Cafe) లోకి వెళ్తారు. అందులో యాంకర్ శివ (shiva) అడిగే ప్రతి ఒక్క ప్రశ్నకి ఆసక్తికరమైన ఆన్సర్లు ఇస్తారు. అయితే తాజాగా ఇనయా కూడా అందులోకి వెళ్ళింది. ఇక యాంకర్ శివ ఇనయా తో మాట్లాడుతూ.. నువ్వు హౌస్ లో ఉన్నప్పుడు ప్రతిసారి నేనే టైటిల్ విన్నర్ అవుతాను అని ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ గా అరిచే దానివి అని అడగ్గా.. నేను టైటిల్ విన్ అవుతాను అనే నమ్మకం నాలో బలంగా నాటుకుంది.అందుకే నేను అలా అరిచే దాన్ని అని చెప్పింది. అయితే రేవంత్ ఎలాంటి వాడు ఆయన గురించి చెప్పు అని శివ అడగడంతో.. ఇనయా మాట్లాడుతూ.. రేవంత్ పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తాడు.

    Click here for follow Pakkafilmy in Google news

ఓసారి ఒకలా మరోసారి ఇంకోలా మాట్లాడుతూ ఉంటాడు అని చెప్పింది.దానికి శివ కౌంటర్ ఇస్తూ సేమ్ నీలాగే ప్రవర్తిస్తాడు కదా అని కౌంటర్ ఇచ్చాడు. దానికి ఇనయా మాట్లాడుతూ నువ్వు రేవంత్ (Revanth) గురించి అడిగి మధ్యలో నన్ను ఎందుకు కలుపుతున్నావ్. మేమిద్దరం ఏమైనా ఓకేలా బిహేవ్ చేసామా అని ఇనయా మాట్లాడగా.. ఏమో నాకు తెలియదు అని అన్నాడు యాంకర్ శివ.దానికి తెలియనప్పుడు మరి నువ్వు ఎలా మాట్లాడుతున్నావ్ నా గురించి అని తిరిగి సెటైర్ వేసింది ఇనయా.అలాగే యాంకర్ శివ మాట్లాడుతూ నువ్వు సూర్య (surya) తో నడిపిన లవ్ ట్రాక్ వల్లే అతను ఉన్నప్పుడు అంత బాగా ఆడలేదు కదా అని అడిగాడు..

దానికి ఇనయా మాట్లాడుతూ..నేను సూర్య ని లవ్ చేస్తున్నానని నీకు చెప్పానా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చింది. అయితే శివ ఇంటర్వ్యూ చేసే బిబి కేఫ్ (BB Cafe) లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని తన ప్రశ్నలతో ఆటాడుకుంటారు. కానీ ఇనయా మాత్రం అతని ప్రశ్నలకు గట్టి జవాబులు ఇస్తూ తనకు తగ్గట్టు మాట్లాడింది. అయితే ఇది చూసిన వాళ్లు కూడా శివకు కరెక్టు ఇనయానే అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ ఇనయా మాత్రం సూర్య ను నేను లవ్ చేశానని నీకు చెప్పానా అని అనడంతో చాలామంది నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి వీళ్ళిద్దరూ లవ్ చేసుకోలేదా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

      Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *