సూపర్ స్టార్ రజినీకాంత్(super star rajinikanth) అంటే తెలియని సినీప్రియలు ఉండరు. బెంగళూరులో ఒక మరాఠీ కుటుంబంలో జన్మించిన ఈయన.. బస్సు కండక్టర్ గా పని చేసేవారు. ఆ త‌ర్వాత న‌ట‌న‌పై ఉన్న మ‌క్కువ‌తో సినిమాల్లో వ‌చ్చారు. ఎలాంటి బ్యాక్ గ్రైండ్ లేక‌పోయినా అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ సూప‌ర్ స్టార్ గా అంద‌రి మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. భారతీయ సినిమా చరిత్రలో అత్యంత ప్రాచుర్యం కలిగిన విజ‌య‌వంత‌మైన న‌టుల్లో ఒక‌రిగా గుర్తింపు పొందారు.

తనదైన నటన, స్టైల్‌, మేన‌రిజ‌మ్స్ తో సౌత్‌, నార్త్ అనే తేడా లేకుండా అన్ని భాష‌ల్లోనూ కోట్లాది ప్రేక్ష‌కుల‌ను త‌న అభిమానులుగా మార్చుకున్న ర‌జినీకాంత్(Rajinikanth) బ‌ర్త్‌డే నేడు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు సంబంధించి ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాలు తెర‌పైకి వ‌స్తున్నాయి. అయితే గ‌తంలో ర‌జినీకాంత్‌ కోసం ఏకంగా 7 రోజులు ఉపవాసం ఉన్నారట. ఇంతకీ ఆ హీరోయిన్ మ‌రెవ‌రో కాదు అతిలోక సుంద‌రి, దివంగ‌త న‌టి శ్రీ‌దేవి. ఈ విష‌యాన్ని ర‌జినీకాంత్ స్వ‌యంగా బ‌య‌ట పెట్టారు.

అస‌లేం జ‌రిగిందంటే.. 2011లో రవికుమార్ దర్శకత్వంలో రజినీ `రానా` అనే సినిమాను ప్రారంభించారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దీపికా పదుకునేను ఫైనల్ చేశారు. అయితే ఈ సినిమా ప్రారంభించిన రోజే రజనీకాంత్‌ అస్వస్థతకు గుర‌య్యారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న ఆరోగ్య బాగా క్షీణించ‌డంతో.. చికిత్స కోసం సింగపూర్ కు తీసుకెళ్లారు. అయితే ఈ విష‌యం తెలుసుకున్న శ్రీ‌దేవి(sridevi) ఎంత‌గానో ఆందోళ‌న చెందింద‌ట‌. రజినీ ఆరోగ్యం మెరుగుపడేందుకు ఆమె షిర్డీ వెళ్లారట‌.

షిర్డీని సందర్శించిన తర్వాత ర‌జినీకాంత్ కోసం ఏకంగా 7 రోజుల పాటు నిరాహార దీక్ష చేశార‌ట శ్రీ‌దేవి. ఇక ఆమె కోరుకున్న‌ట్లే కొద్ది రోజులకు రజినీ పూర్తిగా కోలుకుని ఇండియా కు తిరిగివచ్చారు. దాంతో వెంట‌నే శ్రీ‌దేవి తన భర్త బోనీ కపూర్(boney kapoor) తో కలిసి ర‌జినీకాంత్‌ ను ప‌రామ‌ర్షించింద‌ట‌. అప్ప‌ట్లో ఈ విష‌యం చాలా వైర‌ల్ అయింది. కాగా, ర‌జినీకాంత్‌-శ్రీ‌దేవి త‌మిళ, తెలుగు మరియు హిందీ భాష‌ల్లో దాదాపు 22 చిత్రాల్లో క‌లిసి న‌టించారు. వాటిల్లో ఎన్నో చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచాయి. అలాగే తెర‌పై ర‌జినీకాంత్‌-శ్రీ‌దేవి కెమిస్ట్రీ కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకునేది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *