Sharukh KhanSharukh Khan : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ (Sharukh Khan) తాజాగా హిందూ దేవాలయానికి వెళ్ళడం చర్చనీయాంశం అయ్యింది. షారుఖ్ చేసిన ఈ పనికి అందరు ఫిదా అవుతున్నారు. షారుఖ్ ఖాన్ హీరో గా నటిస్తున్న పఠాన్ సినిమా జనవరి లో విడుదల కు సిద్ధంగా ఉంది.

దాదాపు ఐదేళ్ళ తర్వాత షారుఖ్ నటిస్తున్న సినిమా కావడంతో అయన అభిమానులు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు. అందులోనూ పలు సమస్యలు ఎదుర్కున్న తర్వాత ఈ సినిమా చేస్తున్నాడు షారుఖ్. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఓ పాట కూడా విడుదల కాగా దీపిక అందాలకు అందరు ఫిదా అవుతున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా షారుఖ్ ఖాన్ వైష్ణో దేవి దేవాలయం ను సందర్శించారు. కట్రా లో న్న ఈ గుడికి అయన రాగా అయన వచ్చినట్లు ఎవరికీ తెలియను కూడా తెలియదు అనే చెప్పాలి. ఆయన్ని అక్కడ ఉన్న వారు గుర్తు పట్టలేదట. ఏదేమైనా అందరు సమానం అనే నియమాన్ని పారిస్తూ ఉంటారు షారుఖ్.

    Click here for follow Pakkafilmy in Google news

ముస్లిం అయిన షారుఖ్ ఓ వైపు మసీదు కు వెళుతూనే ఇంకొక వైపు హిందూ దేవాలయాలకు వెళ్ళడం ఆయనలోని సమానత్వాన్ని చూపుతుంది. మరి వచ్చే నెలలో విడుదల కాబోతున్న ఈ పఠాన్ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *