Super Star Rajinikanth Birthday Special Video | #HBDSuperstarRajinikanth | Suresh Productions - YouTubeRajinikanth.. దేశం మెచ్చిన అతి కొద్ది మంది నటులలో సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) కూడా ఒకరు. ఈరోజు ఆయన తన 71వ పుట్టినరోజు వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన కొన్ని విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చిన్న చిన్న వేషాలతో కెరియర్ మొదలుపెట్టిన ఈయన అతి తక్కువ కాలంలోనే బాక్స్ ఆఫీస్ నుంచి హీరోగా ఎదిగారు. ముఖ్యంగా స్టైలిష్ హీరోగా కనిపించే ఈయన రియల్ లైఫ్ లో మాత్రం చాలా సింపుల్ గా ఉంటారు.. ఆయన సినీ ప్రయాణం కూడా చాలా ఆసక్తికరంగా సాగింది.

రజనీకాంత్ అసలు పేరు శివాజీ రావు గైక్వాడ్ బెంగళూరులో స్థిరపడ్డ మహారాష్ట్ర కుటుంబానికి చెందిన వ్యక్తి.. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో 169సినిమాలలో నటించారు. అయితే ఆయన సినీ ప్రయాణం మాత్రం చెన్నైలో ఒక ఎమోషనల్ మూమెంట్తో ప్రారంభం అయింది. అయితే చాలా సంవత్సరాల వరకు ఈ విషయాన్ని భార్యతో సహా ఎక్కడ ఎవరికి చెప్పని రజినీకాంత్.. గత ఏడాది తన 71 పుట్టినరోజు సందర్భంగా అభిమానులతో తెలిపారు.. అది వినగానే రజినీకాంత్ జీవితంలో సినిమాను మించిన ఎమోషనల్ మూమెంట్ ఉందా అని కూడా అందరూ ఆశ్చర్యపోయారు.

సినిమాలపై ఆసక్తితో బెంగళూరు నుంచి చెన్నై బయలుదేరిన రజనీకాంత్ జీవితంలో ఏం జరిగిందనేది ఆయన చెబుతూ.. “టికెట్టు కొనుక్కొని ట్రైన్ ఎక్కాను.. ఆ టికెట్ జర్నీలో ఎక్కడో పడిపోయింది.. కానీ నేను అది గమనించలేదు.. టీసీ గారు టికెట్ అడిగినప్పుడు చూసుకుంటే టికెట్ లేదు. ఏం చేయాలో తెలియదు..నా దగ్గర టికెట్టు లేదని తెలుసుకున్న టిసి నన్ను పక్కన నిలవమని.. మిగతా ప్రయాణికుల దగ్గర టికెట్స్ చెక్ చేశాడు. ఆయన తన పని పూర్తి చేసుకుని నా దగ్గరకు వచ్చి టికెట్ ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు. దానికి నేను సార్ నా దగ్గర డబ్బులున్నాయి చూడండి.. డబ్బులు పెట్టుకొని టికెట్ ఎందుకు కొనను.. ప్రమాణ పూర్తిగా కొన్నాను సార్ కానీ ఎక్కడో పడిపోయింది నన్ను నమ్మండి అంటూ బ్రతిమాలాను.

కానీ ఆయన వినలేదు. ఏం చేయాలో తెలియనప్పుడు అక్కడున్న నలుగురు రైల్వే కూలీలు అక్కడికి వచ్చి సార్ డబ్బులున్నాయి.. టికెట్ కొంటే పోయిందని అంటున్నాడు కదా.. వదిలేయండి. తన ముఖం చూస్తే మోసం చేసే వాడిలాగా అనిపించడం లేదు. ఒకవేళ అతనికి ఫైన్ వేయాలనుకుంటే చెప్పండి మేము నలుగురం కట్టేస్తామని తెలిపినట్లు రజినీకాంత్ తెలిపారు. అయితే రైల్వే కూలీలు అలా చెప్పడంతో టీసీ నన్ను ఒకసారి తేరిపారా చూసి సరే నేను నమ్ముతున్నాను వెళ్ళిపో అని అన్నారు. ఆ దృశ్యం ఇప్పటికీ నాకు ఇంకా గుర్తుంది. నా జీవితంలో మరువలేనిది అంటూ ఆయన తన జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ పంచుకున్నారు.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *