Rajinikanth birthday special know about his property net worth car  collectionRajinikanth.. ఈరోజు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) పుట్టినరోజు..ఆయన 71వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. ఇకపోతే ఈ క్రమంగా ఆయన ఇప్పటివరకు సినిమాల ద్వారా ఎంత సంపాదించారు. వ్యాపారాల ద్వారా ఎంత సంపాదించారు.. ఒక్కో సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటారు అనేది వైరల్ గా మారుతోంది. మరి రజినీకాంత్ ఆస్తుల వివరాలు ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.

ఒక సామాన్య కండక్టర్ నటనపై ఆసక్తితో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి అగ్ర కథానాయకుడుగా మారి దేశాన్ని శాసిస్తున్నాడు . వేలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన జపాన్ లో కూడా విశేష అభిమానులను సొంతం చేసుకున్న ఈయన 1975లో సినీ రంగ ప్రవేశం చేశారు. ఇక అప్పటినుంచి ఈయన ఆస్తి ఎంత కూడబెట్టారు అనే విషయానికి వస్తే సుమారుగా రూ.450 కోట్లకు పైగానే ఉందట. 2018లో రూ.50 కోట్లు సంవత్సర ఆదాయం ఉన్నవారీ జాబితాలో రజిని 14వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.

అంతేకాదు ఇటీవల ఈయన నటిస్తున్న జైలర్ సినిమా కోసం రూ.150 కోట్ల పారితోషకం తీసుకుంటున్నారట. ఇప్పటివరకు భారతదేశంలో ఎవరు కూడా ఈ రేంజ్ లో పారితోషకం తీసుకోలేదు. అంతేకాదు చెన్నైలోని పోయెస్ గార్డెన్ లో ఈయనకు అతిపెద్ద భవనం కూడా ఉంది. ప్రస్తుతం రజనీకాంత్ నివసిస్తున్న ఇంటిదగ్గర సుమారుగా 35 కోట్ల రూపాయలు. పోయేస్ గార్డెన్ లో సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతర సంపన్న వ్యక్తులు మాత్రమే నివసించే అత్యంత సంపన్న ప్రదేశమని చెప్పవచ్చు.

ఇకపోతే తన భార్య లత యాజమాన్యంలో పలు పాఠశాలలలో రజనీకి కూడా వాటా ఉంది. ముఖ్యంగా ఈయన కార్లకు వీరాభిమాని.. రూ.16.5 కోట్ల విలువైన రోల్స్ రాయిస్ ఫాంటమ్, రూ. 6 కోట్ల విలువైన రూల్స్ గోస్ట్, రూ. 1.77 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ x5, రూ.2.5 కోట్ల విలువైన మెరిసిడెస్ బెంజ్ జి వ్యాగన్, రూ.3.10 కోట్ల విలువైన లంబోర్ఘిని తో పాటూ మరెన్నో కార్లు ఈయన సొంతం. మొత్తానికి అయితే ఒక కండక్టర్గా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన నేడు ఇన్ని వందల కోట్ల ఆస్తికి అధిపతి అని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.ప్రస్తుతం రజనీకాంత్ జైలర్ సినిమాలో నటిస్తున్నారు.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *