Karthika Deepam Serial Actor Deepam - Premi Viswanath With His Family Real Life Story 2019 - YouTubePremi viswanath: బుల్లితెర పై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుందో మనందరికీ తెలిసిన మాటే.. ముఖ్యంగా ఇందులో నటించే హీరోయిన్ దీప.. ఈమెని దీపాగా చాలా రోజుల కిందటే మరిచిపోయారు. వంటలక్క అని అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు. కానీ ఈమె ఈ సీరియల్ ద్వారానే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.చెప్పాలంటే ఈమె తెలుగు నటి కాదు. మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటి . అక్కడ కూడా చాలా సినిమాలలో నటించి సీరియల్స్ లో కూడా నటించింది.

అక్కడ తన రాష్ట్రంలోనే కాకుండా ఇక్కడ తెలుగు రాష్ట్రంలో కూడా గుర్తింపు అందుకొని రెట్టింపు అభిమానాన్ని పొందింది. అంతేకాకుండా ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తుంది. నిత్యం ఏదో ఒక పోస్ట్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతోంది. అయితే ఈ విషయాన్ని కాస్త పక్కకు పెడితే తన ఆస్తుల గురించి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆమె వ్యక్తిగతంగా చాలా మంచి మనిషి అలాగే తనకు వినీత్ బట్ అనే జ్యోతిష్య నిపుణుడు తో వివాహం జరిగింది.

    Click here for follow Pakkafilmy in Google news

మరి ఈమె ఆస్తి విషయానికొస్తే బాగానే సంపాదించుకున్నారు. వంటలక్క ఒక నటి మాత్రమే కాదు లాయర్, మోడల్ కూడా.. కార్తీకదీపం షూటింగ్ కి మాత్రమే హైదరాబాద్ కు వస్తూ పోతూ ఉంటుంది. అక్కడ తన రాష్ట్రానికి వెళ్లిన వెంటనే తన బిజినెస్ పనులను కూడా చూసుకుంటుంది. కార్తీకదీపం సీరియల్ కి మాత్రమే ఒక రోజుకు రూ.25 వేలు ఇస్తారట.. అంటే వారానికి ఒక లక్షకు పైగా సంపాదిస్తుంది. తన సొంత రాష్ట్రంలో 10 ఎకరాల పొలం కూడా ఉంది.

అంతేకాకుండా తనకు ఒక నిర్మాణ సంస్థ కూడా ఉందని గతంలో తెలిసింది. ఇక ఈమె దగ్గర రూ.60 లక్షల విలువచేసే కారు ఉందట. ఇంకా ఇవే కాకుండా తన దగ్గర మరికొన్ని ఆస్తులు కూడా ఉన్నాయని తెలిసింది. తన ఆస్తి విలువ రూ.70 కోట్లకు పై మాటే.. అంతేకాదు ఈమెకు కేరళలో రెండు సినిమా స్టూడియోలు కూడా వున్నాయి. దీంతో ఈమెకు ఉన్న ఆస్తులు ఏ అగ్ర హీరోయిన్ కి కూడా ఉండవని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *