నట సింహం నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ `ఆహా` వేదికగా ప్రసారమవుతున్న `అన్ స్టాపబుల్ విత్ ఎన్‌బీకే` అనే టాక్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కంప్లీట్‌ అయిన్‌ ఈ షో ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో రీసెంట్ గా సెకండ్ సీజన్ ను కూడా ప్రారంభించారు. అయితే ఈ షో తాజా ఎపిసోడ్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ గెస్ట్ గా హాజ‌రు అయ్యారు. ప్రభాస్ బెస్ట్ ఫ్రెండ్, టాలీవుడ్ మ్యాచ్ హీరో గోపీచంద్ సైతం ఈ షోలో పాల్గొన్నారు.

సాధారణంగా ప్రభాస్ ఇటువంటి టాక్ షోలకు, టీవీ షోలకు చాలా దూరంగా ఉంటారు. అటువంటి ఆయన బాలయ్య టాక్ షోలో పాల్గొన్నారు. పైగా బాలయ్యతో ప్రభాస్ తొలిసారి తెరపై కనిపించబోతున్నారు. దీంతో అందరి చూపులు ఈ షో పైన పడ్డాయి. తాజాగా అందరి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ ఆహా టీం ప్రభాస్, గోపీచంద్(gopi chand) ఎపిసోడ్ కు సంబంధించిన కొన్ని ఫోటోల‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.

    Click here for follow Pakkafilmy in Google news

`మీరు ఎన్నడూ చూడని ఒక కొత్త యాంగిల్ మీకు చూపించే మాసివ్ ఎపిసోడ్ ఇది. త్వరలో మీ ముందుకు వస్తుంది` అని ఈ సంద‌ర్భంగా ఆహా టీమ్ పేర్కొంది. దీంతో ఆహా వారు తాజాగా షేర్ చేసిన ఫోటోలు అభిమానుల‌ను మ‌రియు సినీ ప్రియుల‌ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ఈ షోలో ప్రభాస్(prabhas) ధరించిన షర్ట్‌ కాస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఎల్లో, గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌తో కూడిన చెక్ షర్ట్‌లో ప్ర‌భాస్ అన్ స్టాపబుల్(unstoppable) షోకు హాజరయ్యారు. అంతేకాదు, కొత్త హెయిర్, కాస్త పెంచిన గెడ్డంతో చాలా హ్యాండ్‌సమ్‌గా క‌నిపించారు. ఇక క‌ల‌ర్ ఫుల్ ష‌ర్ట్ లో ప్ర‌భాస్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాదు, ఆ షర్ట్ బ్రాండ్ అండ్ కాస్ట్ డీటేల్స్ వెతికి పనిలో ప‌డిపోయారు. అయితే ప్ర‌భాస్ వేసుకున్న‌ది `పోలో రాల్ఫ్ లారెన్ మెన్స్ మద్రాస్ బటన్ డౌన్ షర్ట్`. దీని కాస్ట్ 115 పౌండ్స్. అంటే మన ఇండియన్ కరెన్సీలో రూ. 11,618.09 అన్న‌మాట‌. దీంతో చాలా సింపుల్ గా కనిపిస్తున్న ప్ర‌భాస్ ష‌ర్ట్ అంత కాస్ట్లీనా అంటు ప‌లువురు నెటిజ‌న్లు క‌ళ్లు తేలేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *