Pataan : ఇటీవలే కాలంలో బాలీవుడ్ లో తెరకెక్కుతున్న సినిమాలు ఏమాత్రం కూడా విజయాన్ని అందుకోలేక పోతున్నాయి. భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమాలైనా కూడా ప్రేక్షకులను మెప్పించడం లేదు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటిస్తున్న పఠాన్ (Pataan) సినిమా పైనే అందరి చూపు ఉంది.

దాదాపు ఐదేళ్ళ తర్వాత షారుఖ్ ఖాన్ (Baadshah) హీరో గా నటిస్తున్న ఈ సినిమా యొక్క టీజర్ ఇటీవలే విడుదల కాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. జాన్ అబ్రహం విలన్ గా నటిస్తున్న ఈ సినిమా లో దీపిక పడుకునే హీరోయిన్ నటిస్తుంది. యష్ రాజ్ ప్రొడక్షన్స్ లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమా కి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం అందిస్తున్నాడు.

కాగ తాజాగా ఈ సినిమా లోని (Hindi – Besharam) పాట విడుదల అయ్యింది. పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల కాగా ఇందులో దీపిక పడుకునే అందాలకు ఫిదా అవుతున్నారు ప్రేక్షకులు. తెలుగు లో ఈ స్థాయి లో గ్లామర్ పంచిన సినిమా రాలేదనే చెప్పాలి.

    Click here for follow Pakkafilmy in Google news

ఇప్పుడిప్పుడే గ్లామర్ డోస్ ను పెంచుతున్న టాలీవుడ్ ఈ పాట లో దీపిక పడుకునే పంచిన గ్లామర్ చూసి షాక్ అవుతున్నారు. నా నిజం రంగు అనే లిరిక్ తో వచ్చిన ఈ పాట చూసి ప్రేక్షకులు దీపిక అందాల రంగు భలే బాగుంది అనుకుంటున్నారు. విశాల శేఖర్ ఈ పాటను సంగీతం అందించారు. ఈ సినిమా లో టైగర్ సల్మాన్ ఖాన్ కూడా ఓ కీలక పాత్ర లో నటిస్తుండగా ఇది తప్పకుండా బాలీవుడ్ కు భారీ విజయాన్ని తెచ్చి పెడుతుందని చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *