Jabardasth: షేకింగ్ శేషు ఒక గాడిద.. 20 లక్షల మోసం కాదు 70 లక్షలు ఖర్చు:  కిర్రాక్ ఆర్పీ | Jabardasth Kirrak RP latest counter clarifications on  shaking seshu - Telugu FilmibeatJabardast.. ఈ మధ్యకాలంలో నటీనటులు ఒకవైపు సినిమాలు ..మరొకవైపు వ్యాపారాలలో అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు రెస్టారెంట్లను ఓపెన్ చేస్తూ హోటల్ బిజినెస్ రంగంలోకి అడుగులు వేస్తున్నారు. మహేష్ బాబు కూడా తన భార్య పేరు మీద హైదరాబాదులో ఒక రెస్టారెంట్ ఓపెన్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈయనతో పాటు మరి ఎంతోమంది ఇలా హోటల్ బిజినెస్ లోకి తమ చేతులు కలిపారు అని తెలుస్తోంది. ఇకపోతే తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ (Jabardasth)ద్వారా బాగా పాపులారిటీని సంపాదించుకున్న కిరాక్ ఆర్పి కూడా తాజాగా ఒక రెస్టారెంట్ ను ఓపెన్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఇందులో ఏముంది గొప్ప అనుకుంటే పొరపాటే.. కానీ తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం కిరాక్ ఆర్.పీ రెస్టారెంట్ ప్రత్యేకతలు తెలిస్తే ఖచ్చితంగా ఎగబడాల్సిందే అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకూ కిరాక్ ఆర్పి రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటి? అక్కడ ఎలాంటి వంటకాలు దొరుకుతాయి? అనేది ఇప్పుడు చూద్దాం. ఇకపోతే జబర్దస్త్ ద్వారా భారీ పాపులాటని దక్కించుకున్న ఆర్. పీ. ఇటీవల జబర్దస్త్ నుంచి బయటకు వచ్చి కొంతమేర వివాదాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ వివాదం ముగిసిన తర్వాత ఆర్పి హోటల్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు.

కర్రీ పాయింట్ స్థాపించి ఈ రెస్టారెంట్ కి నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు అని పేరు పెట్టి ప్రారంభించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. జబర్దస్త్ కిరాక్ ఆర్పి నెల్లూరుకి చెందిన వ్యక్తి కావడంతో ఈ రెస్టారెంట్లో ఎక్కువగా చేపల పులుసులు ప్రత్యేకంగా నిలవనున్నాయి. ఈ రెస్టారెంట్ యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే చేపల పులుసు, బొమ్మిడాయిల పులుసు, కొరమీను పులుసు , సన్న చేపల పులుసు, రవ్వ చేపల పులుసు, చేప తలకాయ పులుసు ఇలా వెరైటీ వెరైటీ చేపల పులుసులు అందుబాటులోకి తీసుకురానున్నారు.

మరో ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ అన్నీ కూడా కట్టెల పొయ్యి మీదనే తయారు చేయడం ఈ రెస్టారెంట్ స్పెషల్ అని తెలుస్తోంది. ఒకవేళ ఇది కనుక సక్సెస్ అయితే ఇలాంటి బ్రాంచ్ లు మరికొన్ని ఏర్పాటు చేయాలని ఆర్పీ భావిస్తున్నారు. కట్టెల పొయ్యి మీద వండే వంటలు స్వచ్ఛమైన పల్లెటూరు రుచులను అందిస్తాయని జనాలు ఎగబడుతున్నారు.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *