Heroines

Heroines: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి అంటారు. కానీ ఈ జనరేషన్లో నటన రాకపోయినా పర్లేదు కానీ గ్లామర్ మాత్రం చూపించాలి అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. అందుకు తగ్గట్టే ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే చాలా మంది యంగ్ హీరోయిన్లు(Heroine) ఎలాంటి ఎక్స్పోజింగ్ చేయడానికయినా వెనకాడడం లేదు. మరీ ముఖ్యంగా హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలలో, పడక గది సన్నివేశాలలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటిస్తున్నారు.కానీ అప్పట్లో మాత్రం హీరోయిన్స్ అంటే వారి హద్దులు ఏమాత్రం దాటకుండా వారి బాడీలో ఎక్కడ ఏ పార్ట్ చూపించాలో అక్కడ మాత్రమే చూపించి మిగతాదంతా కవర్ చేసుకొని చూడడానికి ఇటు రొమాంటిక్ కాదు అటు సంప్రదాయంగా కాదు అనే విధంగా ఉండేవారు.

    Click here for follow Pakkafilmy in google news

కనిపించాల్సిన చోట చూపిస్తూ మిగతాదంతా కవర్ చేసుకొని చాలా అందంగా కనిపించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో అలా సాంప్రదాయంగా కనిపించే హీరోయిన్లే కరువయ్యారు. కొంతమంది ఎక్స్పోజింగ్ కు దూరంగా ఉండే హీరోయిన్లకు అవకాశాలు రావడం లేదు. దీంతో చాలామంది హీరోయిన్లు (Heroines) తమ గ్లామర్ ని మొత్తం విప్పి చూపిస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో ఎక్కువగా హీరోలకు ప్రాధాన్యం ఉన్న సినిమాలే వస్తున్నాయి. దాంతో దీన్ని దృష్టిలో పెట్టుకున్న హీరోయిన్స్ తమకు కూడా ఒక ప్రత్యేకత కావాలి అనుకున్నారో ఏమో కానీ లెస్బియన్ పాత్రలో నటించడానికి ఓకే చేస్తున్నారు.

ఇక ఈ లెస్బియన్ పాత్రలపై వివాదాస్పద డైరెక్టర్ రాంగోపాల్ (ram gopal varma) వర్మ ఏకంగా ఓ సినిమానే తీశారు. అలాగే ఏమాత్రం ఎక్స్పోజింగ్ చేయని నిత్యామీనన్ కూడా లెస్బియన్ పాత్రలో నటించింది. తాజాగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిన సమంత (samantha) కూడా ఓ హాలీవుడ్ మూవీలో లెస్బియన్ పాత్ర చేయడానికి ఓకే చెప్పిందట. అంతేకాకుండా ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి (manchu lakshmi) కూడా లెస్బియన్ పాత్రలో ఓ రేంజ్ లో రెచ్చిపోయి నటించింది.ఇక ఈ హీరోయిన్ అలా నటించినందుకు చాలా ట్రోల్స్ ఎదుర్కొంది.

కేవలం ఈ హీరోయినే కాదు ఈ లెస్బియన్ పాత్రల్లో నటించిన హీరోయిన్లందరూ ఎన్ని ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ అలాంటి పాత్రలో నటించడానికి మాత్రం వెనకాడడం లేదు. దీనికి ప్రధాన కారణం ఈ మధ్యకాలంలో హీరోయిన్ల (Heroines) ను పట్టించుకోకుండా హీరోల మీద బేస్ చేసుకొని సినిమా కథలను రూపొందిస్తున్నారు.కాబట్టి లెస్బియన్ సినిమాలో నటిస్తే హీరోయిన్ పాత్రకే స్కోప్ ఎక్కువగా ఉంటుంది.. అంతేకాకుండా అడిగినంత రెమ్యూనరేషన్ ఇస్తారు కాబట్టి హీరోయిన్లు ఇలాంటి పాత్రలు చేయడానికి వెనకడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *