Biggboss Inaya Sultana

Biggboss Inaya Sultana: బుల్లితెర రియాల్టీ షోలలో అతిపెద్ద షోగా పేరు తెచ్చుకొని సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది బిగ్ బాస్. ఈ షో మొదటి సీజన్ అంతగా ఆకట్టుకోకపోయినప్పటికీ ఆ తర్వాత ఈ షో మీద అందరికీ ఇంట్రెస్ట్ పెరిగి మెల్లిమెల్లిగా ఈ షో చూడడానికి చాలామంది అట్రాక్ట్ అయ్యారు. దీంతో బుల్లితెర మీదనే టాప్ రేటింగ్ తో దూసుకుపోయే రియాల్టీ షో గా బిగ్ బాస్ పేరు తెచ్చుకుంది.అయితే ప్రస్తుతం బిగ్ బాస్ 5 సీజన్లు పూర్తిచేసుకుని ఆరో సీజన్ కూడా ఇంకో వారం అయితే కంప్లీట్ అవుతుంది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ 6 లో 14వ వారం అనూహ్యాంగా ఎవరు ఊహించని కంటెస్టెంట్ ఇనయా ఎలిమినేట్ అయింది.

అయితే ఇనయా టాప్-2 లో రేవంత్ (Revanth) కు పోటీగా ఉంటుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. కానీ ఇలా ఎలిమినేట్ అవ్వడం ఏ ఒక్కరికి నచ్చడం లేదు. ఇనయా ఎలిమినేషన్ లో బిగ్ బాస్ మోసం చేశాడు అంటూ చాలామంది ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా బిగ్ బాస్ యాజమాన్యాన్ని ఏకిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇనయా (Biggboss Inaya Sultana) ఎలిమినేట్ కావడానికి ప్రధాన కారణం ఆర్జీవి అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే..బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఇనయా మొదటి రెండు మూడు వారాలు సైలెంట్ గా ఉంది. దాంతో రెండోవారానికే ఎలిమినేట్ అవుతుందని చాలామంది భావించారు.

    Click here for follow Pakkafilmy in Google news

ఇక ఆమె నామినేషన్స్ లో ఉన్న టైంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram gopal varma) ఇనయా ని సపోర్ట్ చేయండి అంటూ ఒక ట్వీట్ చేశారు. దాంతో అప్పటినుండి ఇనయా కి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెరిగిపోయి ప్రతివారం ఓటింగ్ లో టాప్ ప్లేస్ లో ఉంది. దాంతో ఇనయ మీద చాలామంది గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అయితే అప్పటినుండి తన పర్ఫామెన్స్ చూపిస్తూ హౌస్ లో స్ట్రాంగ్ లేడీ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకుని ఈమధ్య ఫ్యామిలీ వీక్ తర్వాత కాస్త స్లో అయిపోయింది. ఇంట్లో వాళ్లతో మంచి పేరు తెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో గేమ్ మీద దృష్టి పెట్టకుండా మంచి పేరు తెచ్చుకోవాలని ఆడింది.

అలాగే ఆర్జీవి కూడా తన సినిమాల మీద దృష్టి పెట్టి ఇనయా మీద కాన్సన్ట్రేట్ పెట్టలేదు. దీంతో ఇనయా కు ఓట్లుపడలేదు అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది. అంతేకాదు రాంగోపాల్ వర్మ సపోర్ట్ చేయకపోవడం వల్లే ఇనయా(Inaya sultana) ఎలిమినేట్ అయ్యింది అంటూ వార్తలు రావడం ప్రస్తుతం నెట్టింట్లో హాట్ టాపిక్ అవుతోంది. ఏదేమైనాప్పటికీ ఇనయా అన్ ఫెయిర్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ ని చాలామంది విమర్శిస్తున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *