Bigg Boss Telugu 6: Nagarjuna fee, contestants list, date & moreStar Maa Bigboss6 : బిగ్ బాస్ ఆరవ సీజన్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.  ముఖ్యంగా ప్రేక్షకులు మెచ్చిన వారిని కాకుండా బిగ్బాస్ నిర్వహకులు మెచ్చిన వారే టాప్ ఫైవ్లోకి వెళ్తూ ఉండడం ప్రస్తుతం ఆశ్చర్యకరంగా ఉంది.  దీంతో చాలామంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చివరి దశకు చేరుకున్న ఈ సీజన్ ఫినాలే వీక్ లో కంటెస్టెంట్ ల జర్నీ వీడియోలను చూపించబోతున్నారు. ఇకపోతే బిగ్ బాస్ 6వ సీజన్లోకి రికార్డు స్థాయిలో 21 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్ గా వచ్చిన విషయం తెలిసిందే.
ఇక ఇప్పుడు 14 వారాలకు గాను 15మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 6 మంది మాత్రమే మిగిలి ఉన్నారు. నిన్నటి వారం 14వ ఎలిమినేషన్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. లేడీ ఫైర్ బ్రాండ్ ఇనాయా సుల్తానా బయటకు రావడం ప్రస్తుతం హోస్ట్ నాగార్జున కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఇదంతా బిగ్ బాస్ నిర్వాహకుల వల్లే ఎలిమినేషన్ జరిగిందని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆదివారం రాత్రి నుంచే ఫినాలే వీక్ జరుగుతుంది. అంతేకాదు విన్నర్ ను నిర్ణయించే ఓటింగ్ లైన్స్ కూడా ఓపెన్ అయిపోయాయి.
ఇప్పుడు ఏడుగురు సభ్యుల్లో ఇనయా సుల్తానా ఎలిమినేట్ అవ్వడంతో షో చరిత్రలోనే మొదటిసారి ఆరుగురు సభ్యులు ఫినాలే లోకి అడుగుపెట్టారు. అందులో రేవంత్,  శ్రీహాన్, శ్రీ సత్య , ఆదిరెడ్డి , కీర్తి బట్, రోహిత్ లు ఉన్నారు. 14వ వారం ఎలిమినేషన్ తర్వాత హోస్ట్ అక్కినేని నాగార్జున ఫినాలే లోకి చేరుకున్న కంటెస్టెంట్లను అభినందించాడు. అంతేకాదు వాళ్ళకి బై బై చెప్పిన తర్వాత ఆడియన్స్ కి ఒక సంచలన అనౌన్స్మెంట్ చేశాడు.
అదేమిటంటే ఈవారం మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతుందని వెల్లడించారు.. అంటే గ్రాండ్ ఫినాలే లో ఐదుగురు సభ్యులే ఎంట్రీ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది.. ఇకపోతే ఆదివారం రాత్రి 10:30 గంటల నుంచి జరుగుతున్న ఓటింగ్లో చివరి స్థానంలో నిలిచిన కంటెంట్ బయటకు వెళ్లిపోతారని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశారు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం … శ్రీ సత్యతో పోల్చుకుంటే కీర్తి భట్ కు ఓట్లు తక్కువగా వస్తున్నాయని.. ఈమె ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.(Star Maa Bigboss6 )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *