Vijay Deverakonda Fans : టాలీవుడ్ సినిమా పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా ఉన్న బండ్ల గణేష్ గత కొన్ని రోజులుగా వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నాడు. నిర్మాతగా సినిమాలు చేసే అవకాశం ఉన్నా ఆ విధంగా సినిమాలు చేయకుండా ఇలా టైం పాస్ వ్యవహారాలు చేయడం ఆయనకు చెడ్డ పేరును తీసుకొస్తుంది. దీనిపట్ల అయన అభిమానులు సంతృప్తిగా లేరు.

తాజాగా ఆయన హీరో విజయ్ దేవరకొండ గురించి ఓ ట్వీట్ వేసి అయన అభిమానుల విమర్శలకు గురయ్యాడు. నిన్న తన తండ్రి కి క్షవరం చేసే ఫోటో ను విజయ్ దేవరకొండ తన తండ్రితో ముచ్చటిస్తున్న ఫోటోను జోడిస్తూ ఓ వివాదాస్పద ట్వీట్ వేశారు. అది వేసిన కొన్ని క్షణాల్లోనే విజయ్ దేవరకొండ అభిమానులు ముప్పేట దాడి చేశారు.

దారుణమైన కామెంట్స్ చేస్తూ అయన విమర్శలు చేశారు. వాస్తవానికి హీరోలను కామెంట్ చేయడం బండ్ల గణేష్ కు కొత్తేమీ కాదు. గతంలోనూ నోరు జారీ ఆ అభిమానుల విమర్శలు పొందాడు. కానీ ఈ సారి కావాలనే విజయ్ దేవరకొండ ను టార్గెట్ చేసి అయన ట్వీట్ చేసినట్లు కనిపిస్తుంది.

    Click here for follow Pakkafilmy in Google news

లైగర్ సినిమా తర్వాత ఎలాంటి సినిమా తో ముందుకు రావాలో చర్చిస్తున్న విజయ్ ను ఇందులోకి లాగడం పట్ల అయన అభిమానులు తీవ్రంగా కలత చెందారు. దాంతో ఆయనపై వారు విరుచుకుపడుతున్నారు. మరి ఈ ఇష్యూ ఎంతదూరం వెళుతుందో చూడాలి. గతంలో బండ్ల గణేష్ డేట్స్ అడగగా విజయ్ దేవరకొండ నిరాకరించిన కారణంగా ఆయనపై కక్ష్య కట్టి ఈ విధంగా నెగెటివ్ చేసే విధంగా చేస్తున్నాడని రౌడీ అభిమానులు చెబుతున్నారు. అయితే బండ్ల గణేష్ పెద్ద హీరోలకే రెమ్యునరేషన్స్ ఎగ్గొట్టి వారికే టోపీ పెట్టిన ఘన చరిత్ర కలిగినోడు. అలాంటి నిర్మాత కి రౌడీ స్టార్ డేట్స్ ఇస్తే ఇంకేమైనా ఉందా..(Vijay Deverakonda fans)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *