Actress Anupama Parameswaran's car blown out fans: Do you know why? -  time.news - Time NewsAnupama.. మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ (Anupama) గురించి ఇండస్ట్రీలో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవల కార్తికేయ 2 సినిమాతో భారీ పాపులారిటీని అందుకున్న ఈమె తాజాగా 18 పేజీస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా డిసెంబర్ 23న రిలీజ్ కానున్న నేపథ్యంలో నిన్న ఈ సినిమాకు సంబంధించి పాటను చిత్ర బృందం విడుదల చేశారు. ఇకపోతే అందానికి అందం అంతకుమించి ఆకర్షణ ఉన్న ఈమె ఎందుకు స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోతోంది అనే వార్తలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈమె నటించిన దాదాపు అన్ని చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. కానీ ఈమెకు మాత్రం అంతకు మించిన అవకాశాలు అయితే రావట్లేదు.

అయితే ఇందుకు కారణం ఆమె కెరియర్ తొలినాలలో సెకండ్ హీరోయిన్ రోల్స్ లో నటించడం.. పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే అనుపమ కెరీర్ కు శాపంగా మారిందని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రీజన్ వల్లే స్టార్ హీరోలు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వడానికి ఆసక్తి చూపడం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.

ఇకపోతే కెరియర్ పరంగా ఈమె ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉండి ఉంటే కచ్చితంగా రష్మిక, పూజ హెగ్డే, సాయి పల్లవి వంటి స్టార్ హీరోయిన్ ల రేంజ్ లో ఉండేది అంటూ అభిమానులు భావిస్తున్నారు. అయితే కెరీర్ తొలినాళ్ళ లో కూడా ఈమె అలాంటి పాత్రలు ఒప్పుకున్న స్కిన్ షో చేయడానికి మాత్రం ఒప్పుకోలేదు ఇది కూడా ఈమె కెరియర్ కు మైనస్ అని తెలుస్తుంది.

అయితే ఇప్పుడు అనుపమ(Anupama) స్కిన్ షో కి ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటించడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం రావట్లేదు. ఎంత కష్టపడినా ఈమెకు స్టార్ హీరోలకు జోడిగా ఆఫర్లు రావడంలేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పారితోషకం కూడా డిమాండ్ చేయడం లేదు అయినా కూడా ఈమెను ఎవరు పట్టించుకోకపోవడమే గమనార్హం. మరి ఈమెకు 2023వ సంవత్సరం అయినా కలిసి వస్తుందో లేదో చూడాలి.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *