Annapoorna: సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ పై సీనియర్ నటి అన్నపూర్ణ సంచలన  వ్యాఖ్యలు.. | Tollywood Senior Actress Annapoorna Sensational Comments on  Casting Couch– News18 TeluguAnnapurna.. ఒకప్పటి టాలీవుడ్ నటి మరియు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నపూర్ణమ్మ (Annapurna) గురించీ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమె మోహన్ బాబుతో స్వర్గం నరకం సినిమాలో ఇండస్ట్రీకి మొదటి ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ఏమైందో తెలియదు కానీ హీరోయిన్ గా ఎక్కువ సినిమాలు చేయలేక పోయింది. ఆ తరువాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా 200 ల సినిమాలలో నటించింది. ఆమె తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో నటించి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంది.

ఇంకా చెప్పాలంటే ఆమెకు తల్లి పాత్ర చాలా బాగా సెట్ అవుతుందని చెప్పాలి. ఆ తరువాత రాను రాను బామ్మగా, అమ్మమ్మగా పలు సినిమాలలో నటించింది.అంతేకాకుండా ఆమె చిన్న పాత్ర, పెద్ద పాత్ర అనే తేడా ఏమీ లేకుండా అన్నపూర్ణమ్మ(Annapurna) గారు ఎవరితో అయినా ఏ సినిమాలో అయినా నటిస్తారు. అయితే తన 50 ఏళ్ల కెరీర్ జీవితంలో ఎప్పుడు ఏ విభేదాలు లేవు. ఇక ఇదంతా కాస్త పక్కన పెడితే.. ఈ మధ్యకాలంలో బుల్లితెరపై వస్తున్న జబర్దస్త్ షో ద్వారా ఆమె కూడా కామెడీ చేస్తూ అలరిస్తోంది.

జబర్దస్త్ షోలో ఎక్కువగా బూతు మాటలు ఉంటాయని అలాగే వల్గారిటీ కూడా శృతిమించి పోతోందని చాలామంది అంటూ ఉన్నారు. ఒకప్పుడు అన్నపూర్ణమ్మను తల్లి పాత్రలో చూసినవారు.. ఇప్పుడు జబర్దస్త్ షోలో బూతులను .. డబుల్ మీనింగ్ డైలాగులతో రాంప్రసాద్ టీమ్ లో చేరిన ఆమెను చూసి తన అభిమానులు చాలా ఫీల్ అవుతున్నారు. పైగా అన్నపూర్ణమ్మ వయస్సు ఏంటి ఈ డైలాగులు ఏంటి ఇవి వినటానికి చాలా కంపరంగా ఉన్నాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ చేస్తున్నారు.

ఇలాంటి ఒక షోలో పాల్గొని ఆమె పరువును అలాగే క్రేజ్ ను పోగొట్టుకుంటున్నారని చాలామంది అంటున్నారు. ఆమె చేత ఇలాంటి డైలాగులు చెప్పిస్తున్న రాంప్రసాద్ టీం ని దుమ్మెత్తి పోస్తున్నారు. కనీసం ఇప్పటినుంచి అయినా ఆమెతో చెప్పించకపోతే బాగుంటుందని ఆమె అభిమానులు అంటున్నారు.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *