అందాల భామ అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. తన సహజ నటనతో అనతి కాలంలోనే టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. రీసెంట్ గా ఈ భామ‌ కార్తికేయ 2 సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు అనుపమ నుంచి రెండు సినిమాలు రాబోతున్నాయి. అందులో ఒకటి `18 పేజెస్`. పల్నాటి సూర్యప్రతాప్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో నిఖిల్ హీరోగా న‌టించారు.

సుకుమార్ క‌థ, స్క్రీన్‌ప్లే అందించాడు. అల్లు అరవింద్(Allu Aravind) సమర్పణలో గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ల పై బన్నీ వాసు, సుకుమార్ నిర్మించిన ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీత ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించాడు. ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం డిసెంబ‌ర్ 23న గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఈ సినిమా టీజర్ కి, మరియు నన్నయ్య రాసిన సాంగ్ `టైం ఇవ్వు పిల్ల`కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి `ఏడురంగుల వాన` అనే సాంగ్ ను బ‌డా నిర్మాత అల్లు అరవింద్‌ రిలీజ్‌ చేశారు. అనంత‌రం మీడియాతో ముచ్చ‌టిస్తూ.. ఎన్నో ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను పంచుకున్నారు. `18 పేజెస్ సినిమా కేవలం ఒక లవ్ స్టోరీ కాదని, ఇది ఒక డిఫరెంట్ సబ్జెక్టు అని ఆయ‌న తెలిపారు. సుకుమార్(sukumar) తనతో ఒక విచిత్రమైన లవ్ స్టోరీ చేద్దామని చెప్పారని, బన్నీ వాసు కూడా తెగ సంబరపడిపోయాడని అన్నారు.

సూర్యప్రతాప్ సినిమాను చాలా బాగా తీశారని, హీరో నిఖిల్(Nikhil) చాలా కష్టపడి వర్క్ చేస్తాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ క్ర‌మంలోనే అనుప‌మ‌పై అర‌వింద్ బోల్డ్ కామెంట్స్ చేశారు. అనుపమ న్యాచురల్ యాక్టింగ్ అంటే తనకు ఎంతో ఇష్టమని, తనను చూసినప్పుడల్లా అనుప‌మ లాంటి కూతురు ఉంటే బాగుండు అనే కోరిక పుడుతుంద‌ని మ‌న‌సులో మాట‌ను బ‌య‌ట పెట్టారు. ఇక అల్లు అర‌వింద్ ప్ర‌శంస‌ల‌కు అనుప‌మ ఎంత‌గానో పొంగిపోయింది. కాగా, `కార్తికేయ 2` సినిమా తరువాత అదే జోడీతో `18 పేజెస్` సినిమా రాబోతోంది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తే నిఖిల్‌-అనుప‌మ హిట్ హెయిర్ లిస్ట్ లో చేరిపోతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *