Akkineni Akhil

Akkineni Akhil: ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఒకే ఒక సినిమాతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది సమంత. ఏ మాయ చేసావే అనే సినిమాతో మొదటిసారి తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ సినిమాలో నాగార్జున కొడుకు నాగచైతన్య(naga chaithanya) హీరో అన్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ చేసే టైంలో నాగా చైతన్య సమంతల మధ్య ప్రేమ చిగురించింది. దీంతో ఎన్నో రోజులు వీరు ప్రేమని రహస్యంగా ఉంచి ఆ తర్వాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి మరీ పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.

ఇక అలా పెళ్లి చేసుకొని నాలుగు సంవత్సరాల దాకా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట అనూహ్యాంగా విడాకులు తీసుకుంటున్నామంటూ ప్రకటించారు. ఈ విడాకులు జరిగి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇంకా వీరి గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. తాజాగా సమంత (samantha)పై నాగార్జున( nagarjuna)చిన్న కొడుకు అఖిల్  ఫైర్ అయినట్లు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. సమంత విడాకుల తర్వాత మరింత జోష్ పెంచి సినిమాల పరంగా దూసుకుపోతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సమంత సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల అధిక వర్కౌట్లు చేసి డైటింగ్లు చేయడం వల్ల మయాసైటిస్ అనే వ్యాధి బారిని పడింది.

ఇక ఈ వ్యాధి కోసం ఇండియాలో అనేక చికిత్సలు తీసుకొని మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియాకు కూడా వెళ్ళింది అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే ఈమె మయాసైటిస్ వ్యాధి బారిన పడిందని తెలియగానే చాలామంది సెలబ్రిటీలు అభిమానులు ఈమె త్వరగా కోలుకోవాలని నెట్టింట్లో ఎన్నో కామెంట్స్ చేశారు. అలాగే ఎవరూ ఊహించిన విధంగా అక్కినేని ఫ్యామిలీ నుండి అఖిల్ (Akkineni Akhil)కూడా కామెంట్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయింది.

అయితే తాజాగా ఓ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చిన అఖిల్ సమంతపై కోపగించుకున్నాడట.ఎందుకంటే మా అన్నయ్య తో ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చాలా హ్యాపీగా ఉన్న మా వదిన విడాకులు తీసుకోవడంతో ఒంటరి అయిపోయింది. దాంతో ఆరోగ్యం పై దృష్టి పెట్టకుండా సినిమాల మీద తన ఫోకస్ పెట్టి ఇలా ఆరోగ్యం చెడగొట్టుకుంది. మళ్లీ తాను ఆ వ్యాధి నుండి బయట పడాలంటే కచ్చితంగా ఆమెకు ఓ తోడు కావాలి. ఇలాంటి కష్ట సమయంలో అన్నయ్య వదిన మళ్లీ ఒకటైతే బాగుండు అంటూ మాట్లాడట. ప్రస్తుతం అఖిల్(Akkineni Akhil) చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

   Click here for follow Pakkafilmy in google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *