Vani Sri

Vani Sri: అలనాటి కథానాయికలలో తన నటనతో అందరిని మెప్పించి కళాభినేత్రి అనే బిరుదును అందుకుంది అందాల తార వాణిశ్రీ. ఈమె కలర్ కాస్త తక్కువే అయినప్పటికీ తన నటనతో అందరినీ అలరించింది. అప్పట్లో ఈ హీరోయిన్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేసేవారంటే అతిశయోక్తి కాదు. సినిమా మీద పిచ్చితో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన హద్దులు ఏ మాత్రం దాటకుండా కన్నడ,తెలుగు, తమిళ సినిమా ఇండస్ట్రీలలో దాదాపు కొన్ని వందల సంఖ్యల్లో సినిమాల్లో నటించింది.ఇక హీరోయిన్ వాణిశ్రీ కరుణాకరన్ అనే డాక్టర్ ని వివాహం చేసుకుంది. ఇక వీరికి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు.

ఇక ఇటీవల కాలంలోనే వాణిశ్రీ కొడుకు అభినయ్ వెంకటేష్ కార్తీక్(abhinay venkatesh karthik) గుండెపోటుతో మరణించారు ఇక వాణిశ్రీ తన అందం, అభినయంతో అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో కొనసాగింది. అయితే ఈమె తెరపైకి అలా కనిపించినప్పటికీ ఈమె తెర వెనుక ఎన్నో బాధలు పడిందట. వాణిశ్రీ(Vani Sri) కి కలర్ తక్కువగా ఉన్నప్పటికీ చందమామ లాంటి గుండ్రటి మొహంతో చాలా అందంగా ఉంటుంది. ఈమెకు కలర్ తక్కువ అయినా కూడా కల మాత్రం మొహంలో అద్భుతంగా ఉండేది. ఆమె మొహం తోనే అన్ని హావ భావాలను పలికించేది. దీంతో చాలామంది దర్శక నిర్మాతలు ఈమెను కావాలని మరీ సినిమాలో హీరోయిన్ గా తీసుకునేవారు. అయితే ఈమెకు కలర్ కాస్త తక్కువగా ఉండడం వల్ల సినిమా షూటింగ్ కోసం అందరికంటే ముందే సెట్ కి వచ్చి మేకప్ వేసుకోవడం మొదలు పెట్టేది.

ఇక ఈమె సినిమాలో బాగా కనిపించడానికి ఈమెకు మేకప్ చాలా వేసేవారట మూవీ యూనిట్ వాళ్ళు. అయితే ఈమె మేకప్ పై ఓ జర్నలిస్టు మాత్రం ఈమెను చాలాసార్లు విమర్శించారట. అంతేకాదు ఈమె కలర్ గురించి ఎన్నో వార్తలు రాసి పత్రికలో ప్రచురించేవాడట. అయితే ఈ విషయం తెలిసిన వాణిశ్రీ అతన్ని ముందుగా ఓసారి అలాంటి వార్తలు రాయకండి అంటూ హెచ్చరించిందట. అయినా కూడా ఆ జర్నలిస్టు మాత్రం ఆమెను వదలకుండా పగ పట్టినట్టు కేవలం కలర్ గురించి మాత్రమే కాకుండా ఆమె వ్యక్తిగత విషయాల గురించి కూడా రాయడం మొదలుపెట్టారు. ఇక ఈ విషయంలో వాణిశ్రీ ఆ వార్తలను సహించలేకపోయింది. అయితే ఒకానొక రోజు జమున(jamuna) హరనాథ్ ఇద్దరు కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు.

అందులో వాణిశ్రీ కూడా ఉంది.అయితే వాణిశ్రీ మీద తప్పుడు ప్రచారం రాసే ఆ జర్నలిస్టు హరనాథ్ ని కలవడానికి షూటింగ్ సెట్ కి వచ్చాడు. ఇక అతని షూటింగ్ సెట్లో చూసే సరికి వాణిశ్రీ (Vani Sri)కి కోపం ఆగలేదు. ఇక దొరికిందే సందు అనుకొని ఆ జర్నలిస్టుని రూంలో లైట్లు ఆపేసి చీకట్లో చెప్పుతో పట పట కొట్టిందట. అయితే ఈ విషయంలో హరనాథ్ (haranath)ఆమెను చూసి షాక్ అయ్యారట. ఇక ఆ తర్వాత షూటింగ్ సెట్ నుండి వాణిశ్రీ వెళ్ళిపోయింది. కానీ దర్శక నిర్మాతలు ఎలాగో అలా ఆమెను బ్రతిమిలాడడంతో తిరిగి మళ్ళీ సినిమా షూటింగ్ పూర్తి చేసిందట. ఇలా వాణిశ్రీ తన మీద వచ్చిన వార్తలకు ఆ జర్నలిస్టుపై చేయి చేసుకోవడం అప్పట్లో పెద్ద సెన్సేషన్ అయింది.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *