Trivikram

Trivikram : సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రి కృష్ణ ఈ మధ్యనే మరణించడంతో మహేష్ బాబు చాలా డిప్రెషన్ లోకి పోయారు. కానీ అలానే ఉంటే తాను ఒప్పుకున్నా మూవీ మేకర్స్ కి ఇబ్బందులు వస్తాయని ఆలోచించి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు గా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ డైరెక్షన్ SSMB28  సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే సగం షెడ్యూల్ కంప్లీట్ అయ్యేది.

కానీ సినిమా స్టార్ట్ చేసే టైం కి ఎప్పుడు ఏదో ఒకటి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఓసారి మహేష్ తల్లి ఇందిరా దేవి మరణం, మరొకసారి పూజ హెగ్డే (pooja hegde) వల్ల, ఇంకొకసారి మహేష్ బాబు తండ్రి కృష్ణ (krishna) మరణం వల్ల సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టారు మూవీ మేకర్స్. ఇక ఇందులో భాగంగా డైరెక్టర్ త్రివిక్రమ్ అన్ని సినిమాల్లో ఓ సెంటిమెంట్ ని ఫాలో అయినట్టే ఈ సినిమాలో కూడా అదే సెంటిమెంట్ ని వాడాలని చూస్తున్నారు.

ఇంతకీ ఆ సెంటిమెంట్ ఏంటంటే ఇల్లు సెంటిమెంట్.. అవును.. ప్రస్తుతం మహేష్ బాబు సినిమా కోసం కూడా త్రివిక్రమ్ (Trivikram)  మళ్ళీ తన ఇల్లు సెంటిమెంట్ ని వాడబోతున్నారట. ఇప్పటికే ఈయన అల వైకుంఠపురం సినిమాలో, అలాగే అ ఆ, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమా లో దేవరాజ్ ఇల్లు,అలాగే అత్తారింటికి దారేది సినిమాలో సునంద ఇల్లు ఇలా వరుసగా తన సినిమాల్లో ఇల్లు సెంటిమెంట్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇక తన ఇల్లు సెంటిమెంట్ తో వచ్చిన సినిమాలు అన్నీ కూడా సక్సెస్ అయ్యాయి.

ఇక ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని త్రివిక్రమ్ మరొకసారి మహేష్ బాబు (mahesh babu) తో చేయబోయే సినిమాలో ఇల్లు సెంటిమెంట్ ని వాడబోతున్నారట. దీనికోసం ఒక ప్రముఖ బిజినెస్ మాన్ ఇంటిని త్రివిక్రమ్ బుక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇంట్లో చిన్నపాటి మార్పులు చేసి తమ సినిమాకు ఆ ఇల్లును ఉపయోగించుకోవాలని చూస్తున్నారట. అయితే ఈ సినిమా కోసం ఇల్లు ఇవ్వడానికి ఆ బిజినెస్ మాన్ కూడా సరే అన్నట్లు తెలుస్తోంది. అయితే త్రివిక్రమ్ (Trivikram) ఇల్లు సెంటిమెంట్ ఈ సినిమాకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *