Siri-Srihan: ఇన్‏స్టాలో సిరి ఫోటోలను డిలీట్ చేసిన శ్రీహాన్.. బ్రేకప్ దిశగా లవ్ బర్డ్స్ ?.. | Srihan deleted his girlfriend siri hanumanth photos from instagram | TV9 TeluguSiri Hanumanth సోషల్ మీడియా ద్వారా భారీ పాపులారిటీ సంపాదించుకున్న వారిలో సిరి హనుమంత్ (Siri hanumanth) – శ్రీహన్ (Sreehan) జంట కూడా ఒకటి. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, యూట్యూబ్ వీడియోల ద్వారా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. సోషల్ మీడియా వేదికగా వీరికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడడంతో ఏకంగా బిగ్ బాస్ అవకాశాన్ని కూడా అందుకున్నారు. మొదట సిరి బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేయగా ఇప్పుడు శ్రీ హాన్ సీజన్ సిక్స్ కార్యక్రమంలో కొనసాగుతున్నారు. తాజాగా అరియానా తో కలిసి సిరి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా.. ఆ ఇంటర్వ్యూ సందర్భంగా అరీయానా సిరి గురించి గతంలో వచ్చిన కొన్ని మెసేజ్లను చూపించింది.

ఇందులో సిరి – శ్రీహాన్ కు బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి. ఇవి చూసినటువంటి సిరి బహుశా ఇది బిగ్ బాస్ సీజన్ 5 సమయంలో వచ్చి ఉంటాయని తెలిపింది. అయితే ఆ సమయంలో తనకు శ్రీహన్ కి వ్యక్తిగతంగా చాలా గొడవలు జరిగాయి అని.. ఎంతలా అంటే చివరికి బ్రేకప్ చెప్పుకునే వరకు కూడా వ్యవహారం వెళ్ళింది. ఆ బాధ తట్టుకోలేక పోయాను. శ్రీహన్ నన్ను ఒంటరిగా వదిలేసి ఒక్కడే హాలిడే వెకేషన్ కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో నేను కోవిడ్ సమస్యతో కూడా బాధపడ్డాను. అందుకే ఒంటరిగా వుండలేక ఆ సమయంలో ఏదో ఒకటి చేసుకొని చనిపోవాలని అనుకున్నాను.

కాళ్లకు చెప్పులు లేకుండా రోడ్లపై ఒంటరిగా తిరుగుతూ ఉండగా శ్రీహాన్ నన్ను ఇంటికి తీసుకెళ్లారు. దాంతో మా ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి.. ఇప్పుడు మా ఇద్దరి మధ్య మళ్ళీ బలమైన బంధం ఏర్పడింది అంటూ ఈ సందర్భంగా శ్రీహాన్ తో తన రిలేషన్ గురించి బయట పెట్టింది సిరి హనుమంత్. ప్రస్తుతం సిరి చేసిన ఈ కామెంట్లు చూసి అభిమానులు ఎమోషనల్ అవుతున్నారు. అంత బాధలో కూడా తిరిగి తమ తప్పును తెలుసుకొని ఒకటయ్యారు ఇది చాలదా నిజమైన ప్రేమకు నిదర్శనం అంటూ చెబుతున్నారు.

ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 5 లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్గా గుర్తింపు తెచ్చుకుంది సిరి. ఇప్పుడు టాప్ ఫైవ్లోకి శ్రీహాన్ కూడా వెళ్ళిపోయారు. మరి ఈయనైనా టైటిల్ విన్నర్ అవుతారో లేదో చూడాలి.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *