Shruti Haasan : శ్రుతి హాసన్(shruti haasan).. ఈ అమ్మడి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. యూనివ‌ర్స‌ల్ స్టార్ కమల్ హాసన్(kamal haasan) కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రుతిహాసన్.. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కేవలం నటిగానే కాకుండా సింగర్ గానూ మెప్పించింది. మధ్యలో కెరీర్ కాస్త అదుపు తప్పినా.. మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి రెట్టింపు ఉత్సాహంతో దూసుకుపోతోంది. ఒక్క భాషకే పరిమితం కాకుండా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ లోనూ నటిస్తూ బిజీ హీరోయిన్ గా సత్తా చాటుతోంది. ఇక సినిమాల పరంగా ఎంత ఫేమస్ అయిందో.. లవ్ ట్రాకుల‌వల్ల కూడా శ్రుతిహాసన్ అంతే ఫేమస్ అయ్యింది.

ముఖ్యంగా ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లే(Michael Corsale)తో శ్రుతి హాస‌న్ ఎక్కువ కాలం ప్రేమాయ‌ణం న‌డిపింది. వీరిద్ద‌రూ చాలా కాలం డేటింగ్ చేశారు. క‌మ‌ల్ హాస‌న్ సైతం వీరి పెళ్లికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని అప్ప‌ట్లో ప్ర‌చారం జ‌రిగింది. మైకేల్ కోర్స‌లేతో పీక‌ల లోతు ప్రేమ‌లో మునిగిన శ్రుతి.. కెరీర్ ను సైతం గాలికి వ‌దిలేసింది. క‌ట్ చేస్తే పెళ్లి పీట‌లెక్క‌క‌ముందే వీరిద్ద‌రూ విడిపోయారు. అయితే మైకేల్ తో విడిపోయిన వెంటనే శ్రుతి హాసన్.. శాంతను హజారికా(santanu hazarika) అనే డూడుల్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది.

గ‌త రెండేళ్లుగా వీరిద్ద‌రూ ప్రేమ‌లో ఉన్నారు. ముంబైలో ఒకే ఇంట్లో వీరిద్ద‌రూ కలిసి ఉంటున్నారు. త‌మ రిలేషన్ కి సంబంధించిన అప్ డేట్స్ ని శ్రుతి హాసన్ ఎప్పటకప్పుడు ఇన్‌స్టా వేదికగా పంచుకుంటుంది. అలాగే ప‌బ్లిక్ గానే ప్రియుడితో రొమాన్స్ చేసి గ‌తంలో వార్త‌ల్లో నిలిచింది. ఇక శాంత‌నుతో అయినా శ్రుతి పెళ్లి పీట‌లెక్కి సెటిలైపోతుంద‌ని అందరూ అనుకున్నారు.

    Click here for follow Pakkafilmy in Google news

కానీ, తాజాగా వీరిద్ద‌రూ బ్రేక‌ప్ చెప్పుకున్నార‌నే ప్ర‌చారం సోష‌ల్ మీడియాలో ఊపందుకుంది. అందుకు శ్రుతి హాస‌న్ లేటెస్ట్ పోస్ట్ నే కార‌ణం. `నాలా నేను.. నాతో నేను.. ఉంటేనే ఆనందంగా ఉంది. నేను నా స్వంత కంపెనీని ఆస్వాదిస్తున్నాను. నా టైం విలువ నాకు తెలుసు. నా జీవితాన్ని నేను ఇష్టపడుతున్నాను అనేది నేను రియలైజ్ అయ్యాను. నేడు నాకున్న ఈ స్థాయిని ఎంతో అదృష్టంగా భావిస్తాను` అంటూ శ్రుతి హాస‌న్(shruti haasan) ఇన్‌స్టాలో పోస్ట్ పెట్టింది. అలాగే సింగిల్ గా ఉన్న కొన్ని ఫోటోల‌ను సైతం షేర్ చేసింది. ఈ పోస్ట్ తో బ్రేక‌ప్ వార్త‌లు ఊపందుకున్నాయి. ప్రియుడితో శ్రుతి విడిపోయిందంటూ నెట్టింట‌ ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది.

https://www.instagram.com/p/Cl_t82JLL-Z/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *