Actor Sarathkumar Family : She is known for her roles as nisha in podaa podi, as sooravali in tharai thappattai and. - YijuzeSarath kumar..తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని విలన్ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ (Varalakshmi Sarath Kumar ) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో భారీ పాపులారిటీని సంపాదించుకున్న వరలక్ష్మికి సంబంధించిన ఏ విషయమైనా సరే క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తన తండ్రి శరత్ కుమార్ హాస్పిటల్ లో చేరడంతో పలువురు అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ తమిళ నటుడు శరత్ కుమార్ తాజాగా తీవ్ర అస్వస్థకు గురైనట్లు సమాచారం.

ప్రస్తుతం ఆయన డయేరియాతో డీ హైడ్రేషన్ కి గురైనట్లు అందుకే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. భార్య రాధిక (Radhika) , కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఆసుపత్రికి చేరుకున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం శరత్ కుమార్ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో అటు తమిళ్ ఇటు తెలుగు సిని వర్గాలలో టెన్షన్ మొదలయ్యింది. ఆయన త్వరగా కోలుకోవాలని ట్వీట్ కూడా చేస్తున్నారు. కేవలం అభిమానులు ప్రేక్షకులు మాత్రమే కాదు సినీ సెలబ్రిటీలు, బంధువులు కూడా శరత్ కుమార్ త్వరగా కోలుకొని ఇంటికి రావాలని ఆకాంక్షిస్తున్నారు.

ఇదిలా ఉండగా డిసెంబర్ 2020లో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆ విషయాన్ని ఆయన భార్య రాధిక ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం డయేరియాతో బాధపడ్డానికి కారణం ఒకరకంగా కరోనా కూడా అయి ఉండవచ్చు అని తన అభిప్రాయాన్ని వెల్లడించింది రాధిక. ప్రస్తుతం రాధిక తన భర్తను అలా ఆస్పత్రిలో చూడడంతో ఆమె దుఃఖంతో కృంగిపోతున్నారు.. ఇకపోతే తండ్రి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ఏం చేయాలో దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రతిభావంతులైన వైద్యుల పర్యవేక్షణలో శరత్ కుమార్ చికిత్స తీసుకుంటున్నట్లు త్వరగా కోలుకుంటారు అని కూడా వైద్యులు తెలియజేస్తున్నాయి.

ఇక వరలక్ష్మి సినిమాల విషయానికి వస్తే.. తమిళ్లో హీరోయిన్ గానే కెరియర్ మొదలుపెట్టిన ఈమె ఆ తర్వాత విలన్ పాత్రలకే పరిమితం అయింది. ప్రస్తుతం తెలుగులో ప్రతి సినిమాలో కూడా విలన్ పాత్రలు పోషిస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంటున్న ఈమె ఇటీవల యశోద సినిమాతో మరింత గుర్తింపు తెచ్చుకుంది .ప్రస్తుతం బాలకృష్ణ (Balakrishna) నటిస్తున్న వీరసింహారెడ్డి సినిమాలో కూడా కీలకపాత్ర పోషిస్తోంది.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *