Sai Pallavi : న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి(sai pallavi) బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతోందని గత కొద్ది రోజులుగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లో ప్రముఖ దర్శకుడు నితీష్‌ తివారీ ఇటీవల రామాయణం కథను సరికొత్తగా కోణంలో చూపించబోతున్నట్లు వెల్ల‌డించారు. ఇంద‌లో రాముడిగా రణ్​బీర్​ కపూర్‌, రావ‌ణుడిగా హృతిక్‌ రోషన్ న‌టించ‌బోతున్నారు. మధు మంతెన, నమిత్ మల్హోత్ర, అల్లు అరవింద్ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించ‌బోతున్నారు.

ఈ భారీ పౌరాణిక చిత్రం ఇప్ప‌టికే ప‌ట్టాలెక్కాల్సి ఉన్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా ఆల‌స్య‌మ‌వుతూనే వ‌చ్చింది. అయితే వ‌చ్చే ఏడాది ఆరంభంలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా ప్రారంభించ‌బోతున్నార‌ట‌. అలాగే ఈ సినిమాలో సీత పాత్ర కోసం కరీనా కపూర్(kareena kapoor) ను సంప్రదించార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ, కెరీర్ ఆరంభం నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న‌ పాత్రలను ఎంచుకుంటూ తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న సాయి పల్లవిని సీత పాత్ర కోసం ఎంపిక చేశార‌నే ప్ర‌చారం ప్ర‌స్తుతం నెట్టింట జోరుగా సాగుతోంది.

ఇప్ప‌టికే సంప్ర‌దింపులు పూర్తి అయ్యాయ‌ని.. రణ్​బీర్​ కపూర్(Ranbir Kapoor) కు జోడీగా సీత పాత్ర‌లో న‌టించేందుకు సాయి ప‌ల్లవి ఓకే చెప్పింద‌ని అంటున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమాకు సాయి ప‌ల్ల‌వి అందుకుంటున్న రెమ్యున‌రేష‌న్ అంద‌రినీ షాక్ కి గురి చేస్తోంది. సౌత్ లో ఇన్నాళ్లు ఈ అమ్మ‌డు ఒక్కో సినిమా రూ. 1.5 నుంచి 2 కోట్ల రేంజ్ లో రెమ్యున‌రేష‌న్ అందుకుంది.

కానీ, బాలీవుడ్ రామాయ‌ణంలో న‌టించేందుకు సాయి ప‌ల్ల‌వి ఏకంగా రూ. 4.5 కోట్లు డిమాండ్ చేసింద‌ట‌. నిర్మాత‌లు సైతం ఆమె అడిగినంత ఇచ్చేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని.. సాయి ప‌ల్ల‌వి కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఇదే అత్య‌ధిక పారితోషికం అని ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఈ ప్ర‌చారం ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాల్సి ఉంది. కాగా, సాయి ప‌ల్ల‌వి చివ‌ర‌గా `విరాట ప‌ర్వం`(virata parvam), `గార్గి` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. ఈ సినిమాలు పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయాయి. ఈ చిత్రాల అనంత‌రం సాయి ప‌ల్ల‌వి నుంచి కొత్త ప్రాజెక్ట్ ల అనౌన్స్‌మెంట్ ఏమీ రాలేదు.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *