RC16 : సుకుమార్‌ (sukumar) ప్రియ శిష్యుడు బుచ్చిబాబు గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్‌, కృతి శెట్టి జంటగా నటించిన `ఉప్పెన` సినిమాతో దర్శకుడుగా బుచ్చిబాబు టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈయన తన రెండో సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేయాలని భావించాడు. కానీ, అనూహ్యంగా బుచ్చిబాబు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అనౌన్స్ చేశాడు.

`ఆర్సీ 16`(RC16) వర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్క‌బోయే ఈ ప్రాజెక్ట్ పై ఇటీవల అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా ఎంపిక అయింని అంటున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆరంభంలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers), వృద్ధి సినిమాస్‌, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై కిలారు వెంకట సతీష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మించబోతున్నారు.

అయితే ఈ సినిమా కోసం ఏకంగా రూ. 300 కోట్ల బడ్జెట్ ను కేటాయించ‌బోతున్నారట. బుచ్చిబాబుకు ఇది రెండవ సినిమా. స్టార్ హీరోలతో చేసిన అనుభవం లేదు. పైగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసే సత్తా ఆయనకు ఉందా లేదా అన్నది తెలియదు. కానీ బుచ్చిబాబు(buchi babu) తెరకెక్కించిన ఉప్పెన సినిమా 100 కోట్ల మార్కెట్ ను అందుకుంది. ఈ కారణంగానే నిర్మాత కిలారు వెంకట సతీష్ ఆ రేంజ్ లో బడ్జెట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

అయితే ఈ ప్రచారం పట్ల సినీప్రియలు రకరకాలుగా స్పందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్(Ram charan) కు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందిస్తాడని కొందరు అంటుంటే.. రిజ‌ల్ట్ ఏమైనా తేడా వస్తే దూల తీరిపోతుంద‌ని మరికొందరు వెటకారం చేస్తున్నారు. మరి బుచ్చిబాబు చరణ్ కు హిట్ ఇచ్చి నిర్మాతలకు లాభాలను తెచ్చి పెడతాడా? లేదా? అన్నది చూడాలి. కాగా, రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తన 15 చిత్రాన్ని చేస్తున్నాడు. ఇందులో కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆఖరిలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *