Kriti Sanon

Kriti Sanon: బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న కృతి సనన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈ హీరోయిన్ మహేష్ బాబు (mahesh babu) తో చేసిన వన్ నేనొక్కడినే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయింది. ఈ సినిమా అంతగా హిట్ అవ్వన్నప్పటికీ హీరోయిన్ మాత్రం అందరికీ గుర్తుండిపోయింది. అలాగే ప్రభాస్ హీరోగా వచ్చిన పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్ సినిమాలో కూడా అవకాశం దక్కించుకొని మరొకసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీగా ఉంది.

అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది కానీ రిలీజ్ కి ఇంకా నోచుకోవడం లేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కృతి సనన్ (Kriti Sanon) తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. కృతి సనన్ మాట్లాడుతూ.. నేను మహేష్ బాబుతో నటించడం నా అదృష్టం అని అనుకుంటాను. ఎందుకంటే ఆయన వల్లే నేను తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాను. అలాగే మహేష్ బాబు చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఇక నాకు తెలుగు భాషలో మరింత పటుత్వం రావడానికి ప్రధాన కారణం ప్రభాస్.

ఎందుకంటే నేను ఆయనతో ఆది పురుష్ (aadi purush) సినిమా షూటింగ్ చేసేటప్పుడు ఆయన నాకు తెలుగు చాలా నేర్పించారు. ప్రస్తుతం తెలుగులో ఎవరైనా ఏదైనా మాట్లాడితే నాకు అర్థం అవుతుంది అని చెప్పింది. అలాగే ఆమె మాట్లాడే టైంలో జర్నలిస్టు మీ పెళ్లికి ఎలాంటి వ్యక్తి కావాలి అని అడగడంతో ఆమె తనకు కాబోయే వ్యక్తి గురించి మాట్లాడుతూ.. నాకు కాబోయే భర్త నా అందానికి తగిన వాడై ఉంటే చాలు. నాలాగే అందంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అంటూ చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం ఆమె మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే కృతి సనన్ గురించి ఈ మధ్యకాలంలో ప్రభాస్ (prabhas) ని పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వచ్చాయి. అంతేకాదు ఓ ఇంటర్వ్యూలో అవకాశం వస్తే ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా అనడంతో చాలామంది అభిమానుల్లో ఈమెపై అనుమానాలు మొదలయ్యాయి. కానీ ఒక్కసారిగా వీరి విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్ళీ స్వయంగా కృతి సనన్ ( Kriti Sanon) అలాంటిదేమీ లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *