Jayamalini

Jayamalini: అప్పట్లో ఐటమ్ సాంగ్స్ కి పెట్టింది పేరుగా ఉండేది జయమాలిని. ఈమె సాంగ్ ఉందంటే అప్పట్లో చాలామంది ప్రేక్షకులు ఎగబడి మరీ వచ్చేవారట.అయితే అలాంటి హీరోయిన్ భర్త కి మాత్రం జయమాలిని కన్నా వేరే హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టమట. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. జయమాలిని (Jayamalini) ఈ నటి పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అప్పట్లో ఆమె ఎన్నో ఐటెం సాంగ్స్ లో చేసి మంచి పేరు తెచ్చుకుంది.

అయితే తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందరితో పంచుకుంది.. జయమాలిని (Jayamalini) మాట్లాడుతూ.. అప్పట్లో ఎన్టీఆర్ (NTR) గారు రాముడు,కృష్ణుడు పాత్రల్లో నటించినప్పటికీ ఆ తర్వాత మాతో కలిసి స్పెషల్ సాంగ్స్ లో కూడా స్టెప్పులు వేశారు. ఇక సీనియర్ ఎన్టీఆర్ జనరేషన్ తర్వాత చిరంజీవి డాన్స్ చాలా బాగా చేస్తారు. అలాగే మా ఆయనకి నాకంటే ఎక్కువ తమన్నా అలాగే కాజల్ అంటే ఇష్టం అంటూ జయమాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయితే ఈ విషయం తెలిసిన నెటిజన్స్ ఏంటి మీకంటే తమన్ననే ఎక్కువ ఇష్టమా అంటూ షాక్ అవుతున్నారు. ఇక తమన్నా (Thammannah bhatia) ప్రస్తుతం రెండు కోట్ల లోపు రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల చాలామంది దర్శక నిర్మాతలు ఈమె రెమ్యూనరేషన్ తక్కువ కదా అని సినిమాల్లో ఆఫర్స్ ఇస్తున్నారు. అలాగే తమన్నా ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేస్తూ వస్తుంది. ఈ కారణంతో చాలామంది ఈమెకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఇవ్వడం లేదు.

ఇందువల్ల ఈమె రాను రానూ హీరోయిన్ పాత్రల నుండి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారబోతుంది కావచ్చు అని చాలామంది ఈమె అభిమానులు బాధపడుతున్నారు. ఇక తమన్నా నటించిన గుర్తుందా శీతాకాలం (gurthunda sheethakalam) అనే సినిమా తాజాగా విడుదలైంది. కానీ ఈ సినిమా చూసిన నెటిజెన్స్ ఇలా ప్రాధాన్యత లేని పాత్రల్లో నటిస్తూ నీ రేంజ్ నువ్వే తగ్గించుకుంటున్నావు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికైనా ఆచితూచి సరైన పాత్రలను ఎంచుకో అంటూ సజెషన్స్ కూడా ఇస్తున్నారు. మరి నెటిజెన్స్ మాటలు విని ఇప్పటికైనా తమన్నా మంచి పాత్రలు ఎంచుకుంటుందో లేదో వేచి చూడాలి.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *