Biggboss6

Biggboss6: భారీ అంచనాల మధ్య చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో 21 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చారు. ఇందులో చాలామంది తెలియని మొహాలు బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకువచ్చారు అంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు ఎవరు బిగ్ బాస్ చూడడానికి ఆసక్తి కనబర్చలేదు. కానీ రాను రాను షో మీద ఆసక్తి పెరిగింది. అంతేకాకుండా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు హౌస్ నుండి ఎలిమినేట్ కావడంతో వారం వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని బిగ్ బాస్ చూసే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

ఇక నాలుగైదు వారాల నుండి వరుసగా ఊహించని కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. అసలు వీళ్ళు టాప్ -5 లో ఉంటారు అనుకున్నా వాళ్ళనే ఎలిమినేట్ చేస్తున్నారు అంటూ చాలామంది ప్రేక్షకులు బిగ్ బాస్ యాజమాన్యాన్ని తిట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఇనయా సుల్తానా (inaya sultana) ఎలిమినేట్ అయినట్టు తెలుస్తోంది. విషయంలోకి వెళ్తే.. ఈవారం ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. ఇక ఇందులో ఓటింగ్ పరంగా చూసుకుంటే ఎప్పటి లాగే రేవంత్ (revanth) ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, రోహిత్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు.

థర్డ్ ప్లేస్ లో ఇనయా సుల్తానా, ఫోర్త్ ప్లేస్ ఆది రెడ్డి, ఫిఫ్త్ ప్లేస్ లో శ్రీ సత్య ఉంది అంటూ ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి. అయితే శ్రీ సత్య,కీర్తి భట్ (keerthi bhatt) కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన ఇనయా సుల్తానా ని బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో చాలామంది బిగ్ బాస్ ని విమర్శిస్తున్నారు. టైటిల్ రేస్ లో ఉండాల్సిన ఇనయా (inaya sultana) కి అన్ని ఓట్లు వచ్చినప్పటికీ ఇలా ఎలిమినేట్ చేయడం మోసం అంటూ చాలామంది ఈమె అభిమానులు విమర్శిస్తున్నారు. ఇనయా ఓట్ల పరంగా మూడో ప్లేస్ లో ఉంది.

ఈమె కన్నా తక్కువ ఓట్లు ఉన్న వారిని ఉంచి ఇనయా ని ఎలిమినేట్ చేయడంలో అర్థం ఏంటి అంటూ బిగ్ బాస్ ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు బిగ్ బాస్ ( Biggboss6) యాజమాన్యం కావాలనే ఇనయా ని ఎలిమినేట్ చేశారు. హౌస్ లో ఉన్న ముగ్గురిలో ఇనయా నే స్ట్రాంగ్ కంటెస్టెంట్. అలాంటిది ఇనయా ని ఎలిమినేట్ చేయడం ఏంటి? వాళ్ళ దగ్గర ఎన్ని డబ్బులు తీసుకున్నారు అంటూ బిగ్ బాస్ ని ఇనయా అభిమానులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఇనయా ని ఎలిమినేట్ చేయడం మాత్రం సరైన పద్ధతి కాదు అంటూ ప్రేక్షకులు బిగ్ బాస్ ని విమర్శిస్తున్నారు.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *