Bigg Boss 6 Telugu Inaya Sultana: ఆ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేసేలా బిగ్ బాస్ కుట్ర.. ఆ వీడియోలే సాక్ష్యం? - OK TeluguBigboss6.. తెలుగులో ప్రస్తుతం రసవత్తరంగా సాగుతున్న రియాల్టీ షో అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆరవ సీజన్లో 21 మంది కంటెస్టెంట్లు రాగా.. 14 వారాలకు గాను 14 మంది ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌస్ లో 6 మంది మాత్రమే ఉన్నారు. వారిలో కీర్తి , శ్రీ సత్య , శ్రీహాన్ , ఆదిరెడ్డి, రేవంత్, రోహిత్ మాత్రమే టైటిల్ విన్నర్ కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉండగా టాప్ ఫైవ్ లో కచ్చితంగా రేవంత్ కి పోటీ ఇస్తుంది ఇనయా సుల్తానా (Inayasulthana) అని అందరూ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఓట్లను కూడా కైవసం చేసుకుంది. కానీ ఊహించని విధంగా ఆమె 14వ వారం ఎలిమినేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం బిగ్ బాస్ (Bigboss6) లో ఉన్న ఆడవారితో పోల్చుకుంటే ఈనా సుల్తానా బెస్ట్ కంటెంట్ ఇచ్చిందని చెప్పవచ్చు. కీర్తి అయితే సెంటిమెంట్ తోనే ఎక్కువగా హైలైట్ అయ్యే ప్రయత్నం చేసింది. శ్రీ సత్య కూడా దాదాపు అదే తరహాలో తన సమస్యలను చెప్పుకుంటూ హైలెట్ అయ్యే ప్రయత్నం చేసింది. కానీ ఇనయ సుల్తానా మాత్రం ప్రతి టాస్క్ లో కూడా అబ్బాయిలతో పోటీ పడుతూ వారి కంటే బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నం చేసింది. అంతేకాదు ప్రేక్షకుల మన్ననలు కూడా పొందింది. మొదట్లో రాంగోపాల్ వర్మ సపోర్టుతో బిగ్ బాస్ లోకి వచ్చిన ఈమె అతి తక్కువ సమయంలోనే భారీ పాపులారిటీని దక్కించుకుంది.

అంతేకాదు రాంగోపాల్ వర్మ స్వయంగా తన ట్విట్టర్ ద్వారా ఇనయా కి సపోర్ట్ చేయాలని కూడా కామెంట్లు చేశారు. దీంతో ఇనయాకు మంచి ఫాలోయింగ్ పెరగడమే కాకుండా ఈమె ఆట తీరు చూసి మెచ్చిన ప్రేక్షకులు ఓట్లు కూడా వేశారు. కానీ ఊహించని విధంగా ఆమె ఎలిమినేట్ అయ్యింది. అయితే కావాలనే ఇనయా.. రేవంత్, రోహితులకు పోటీ వస్తోందని ఎలిమినేట్ చేశారు అన్నట్లుగా ఒక వర్గం ప్రేక్షకులు తమ అభిప్రాలను వ్యక్తం చేస్తున్నారు.

ఎవరు ఎలాంటి కామెంట్లు చేసినా మొత్తానికి అయితే ఇనయా ఎలిమినేట్ అయ్యింది. మరి 14 వారాలకు గాను ఆమె హౌస్ లో ఉన్నందుకు ఎంత పారితోషకం తీసుకుంది అనే విషయానికి వస్తే వారానికి రూ.15000 చొప్పున 14 వారాలకు గాను రూ.2,10,000 సొంతం చేసుకుంది. మొత్తానికైతే ఇది ఈమెకు పెద్ద అమౌంట్ అని చెప్పవచ్చు.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *