Balakrishna107

Balakrishna107: నందమూరి తారక రామారావు అంటే పరిచయం అక్కర్లేని పేరు. ఆయన తన నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ గొప్ప స్థాయిలో నిలబెట్టారు. అలాంటి నందమూరి తారక రామారావు వారసుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు నందమూరి నటసింహం బాలకృష్ణ. తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తండ్రి కి తగ్గ తనయుడి గా పేరు సంపాదించుకొని ప్రస్తుతం ఆరుపదల వయసు దాటినా కూడా కుర్ర హీరోలకు దీటుగా తన పర్ఫామెన్స్ చూపిస్తూ బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటిస్తున్నారు.

ఈ మధ్యనే ఈయన హీరోగా వచ్చిన అఖండ (akhanda) సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే అలాంటి బాలకృష్ణకు స్టార్ హీరో కూతురు కోపం తెప్పించినట్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. బాలకృష్ణ 107 (Balakrishna107) సినిమాని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రానుందని ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.ఇక ఈ సినిమాలో బాలకృష్ణ హీరోగా శృతిహాసన్ (sruthi hasan) హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ఓ ముఖ్యపాత్రలో సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి కూడా నటిస్తున్నట్టు ఇప్పటికే ఎన్నో వార్తలు వచ్చాయి.

అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం హీరోయిన్ కంటే వరలక్ష్మీ (varalakshmi) పాత్రకే చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది అంటూ మూవీ యూనిట్ చెప్పినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త వస్తుంది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి (anil ravipudi) డైరెక్షన్లో సినిమా చేస్తానని ఒప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే బాలకృష్ణకి వరలక్ష్మితో ఉన్న క్లోస్ నెస్ కారణంగా నా రాబోయే సినిమాలో కూడా నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెయ్యి అంటూ ఫన్నీగా వరలక్ష్మి ని బాలకృష్ణ అడిగారట. అయితే ఈ సినిమా లో నటించడానికి నా దగ్గర డేట్స్ ఖాళీగా లేవు అంటూ తల పొగరు తో బాలకృష్ణకి సమాధానం ఇచ్చిందట ఈ నటి.

ఇక ఆమె తల పొగరును వంచాలనే ఉద్దేశంతో బాలకృష్ణ సరదాగా మాట్లాడుతూనే ఎవరైనా బాలకృష్ణ (Balakrishna107) కే ఫస్ట్ ప్రియారిటి ఇవ్వాలి నా తర్వాతే ఎవరైనా లేకపోతే వారి పని దబిడి దిబిడే అంటూ సరదాగా మాట్లాడుతూనే వార్నింగ్ ఇచ్చారట. ఇక బాలకృష్ణ వార్నింగ్ తో వరలక్ష్మి కి స్ట్రాంగ్ కౌంటర్ పడింది అంటూ చాలామంది ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారు. అంతేకాదు బాలకృష్ణ అంటే మామూలు విషయం కాదు ఆయన తర్వాతే ఎవరైనా అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *