vijay deverakonda Janhvi Kapoor in TollywoodJanhvi Kapoor in Tollywood : బాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ జాన్వీ కపూర్. ఆమె తెలుగు లో ఎంట్రీ చేయాలని చాలామంది అభిమానులు భావిస్తుండగా ఎప్పటికప్పుడు అది ఆలస్యం అవుతూనే ఉంది. తాజాగా ఆమె రామ్ చరణ్ (Ramcharan) సరసన బుచ్చిబాబు (Bucchibabu) దర్శకత్వంలో సినిమా చేయబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి.

అంతకుముందు ఆమె హీరోయిన్ గా తెలుగు లో పలు హీరో ల తో సినిమాలు చేస్తుందని వార్తలు వినిపించాయి కానీ ఏదీ కూడా వర్కౌట్ కాలేదు. ఫైనల్ గా ఈ సినిమా తో తెలుగు ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తాజాగా తెలుగు స్టార్ హీరో విజయ్ దేవరకొండ తో కలిసి ఆమె ఓ యాడ్ లో చేయడం జరిగింది. గతంలో కూడా ఆమె కొన్ని యాడ్స్ లో నటించింది. అయితే ఆమె తెలుగు లో సినిమా ఎంట్రీ చేస్తుందని బజ్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడిది ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ చేసిన #IQOO (IQOO) అనే యాడ్ లో వీరిద్దరూ కలిసి నటించారు.మరి ఇంకెందుకు ఆలస్యం వీరిద్దరూ చేసిన ఆ యాడ్ ను చూసేయండి.

గత కొంత కాలంగా వరుస యాడ్స్ చేస్తున్న విజయ్ దేవరకొండ (Vijay deverakonda) ఇటీవలే ముంబై వెళ్లునప్పుడు అక్కడే చేసినట్లుగా తెలుస్తుంది. థమ్స్ అప్ వంటి భారీ బ్రాండ్ లకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న విజయ్ దేవరకొండ ఇటీవలే లైగర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇప్పుడు తన తదుపరి సినిమా ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. త్వరలోనే అయన చేయబోయే కొత్త సినిమా అనౌన్స్ మెంట్ జరుగుతుంది. (Janhvi Kapoor in Tollywood)

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *