Shoban babu

Shoban Babu:  బిలియనీర్ అందాల శోభన్ బాబు అంటే ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా ఎదిగారు. ఈయన స్టార్ హీరోగా ఎదగడానికి ముందు ఎన్నో కష్టాలు పడ్డారట. ఇక విషయం లోకి వెళ్తే..ఒక నిరుపేద కన్నీళ్ల శోభన్ బాబు జీవితాన్ని తొలిసారిగా ఆకెళ్ళ రాఘవేంద్రరావు (Akella Raghavendra rao) గారు “పరుగు ఆపడం ఒక ఎలా” అనే పుస్తక రూపంలో ఆవిష్కరించారు. అయితే ఈ పుస్తకాన్ని మూడువంతులు రాసింది శోభన్ బాబు గారే. అందులో కేవలం ఒక్క వంతు మాత్రమే ఆకెళ్ళ రాఘవేంద్రరావు రాశారు.

ఎన్ని సినిమా ఛాన్స్ లు వచ్చినా కూడా అద్దకట్టలేని శోభన్ బాబు గారి దుస్థితి, యజమాని కరెంట్ బిల్ కట్ చేయగా శోభన్ బాబు (Shoban Babu) తన కుటుంబంతో సహా కడు చీకట్లో గడిపిన కాలరాత్రులు ఎన్నో ఉన్నాయి. ఇలా శోభన్ బాబు గురించి ఎన్నో దయనీయ పరిస్థితుల మొత్తం సమాచారం ఆ పుస్తకంలో ఉంటుంది. వీరాభిమన్య (Veerabhimanyu) హీరో ఛాన్స్ వచ్చిన తర్వాత కూడా శోభన్ బాబు మద్రాస్ వీధుల్లో సైకిల్ మీద తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. వాయిదాల మీద కొన్న సెకండ్ హ్యాండ్ కారును టాక్సీగా మార్చి డ్రైవర్ గా జీవితాన్ని గడుపుదాం అనుకున్నారు శోభన్ బాబు.

కానీ ఆయన భార్య ఆయనకు ధైర్యం చెప్పడం వల్ల డ్రైవర్ అవుదామనే నిర్ణయాన్ని మార్చుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో నేను పనికిరాను. సున్నిత హృదయం గల నాలాంటి వాళ్లు ఇండస్ట్రీలో ఎదగలేరు ఇక ఇంటికి వెళ్లి పోదాం అని శోభన్ బాబు చాలా దుఃఖించారట. ఇలా శోభన్ బాబు సినిమాల కోసం మద్రాస్ (Madras) వెళ్ళినప్పుడు ఏకంగా 10 సంవత్సరాల పాటు ఇలాంటి దుస్థితినే అనుభవించారట. ఒక వర్గీయ గుర్తింపు ఉంటే చాలు సినిమా రంగంలో విజయానికి దగ్గరవుతారు అని నమ్మే వాళ్లు ఈ జనరేషన్ లో చాలామందే ఉన్నారు. కానీ అది నిజంగా నిజం కాదని అప్పట్లో శోభన్ బాబు జీవితం చూస్తే అర్థమవుతుంది.

ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆయనకు కొంచెం కూడా ఉపయోగపడలేదు. ఈయన కేవలం తెరమీద మాత్రమే హీరో కాదు నిజ జీవితంలో కూడా హీరోనే.ఈయన తను గడిపిన జీవితాన్ని దృష్టిలో పెట్టుకొని ఎంతోమంది పేద వాళ్లకు గుప్త దానాలు చేశారంటూ అప్పట్లో ఈయన గురించి చాలామంది చెప్పుకునేవారు. కానీ ఆయన ఈ దానాలు చేస్తున్నారని పది మందిలో చెప్పుకోవడానికి మాత్రం వెనకాడేవారు.అంత దీన స్థితి లో జీవితాన్ని గడిపిన శోభన్ బాబు (Shoban Babu) ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి చాలా కోట్లు సంపాదించారు.

         Click Here For Follow Pakkafilmy In Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *