డీజే టిల్లు 2' హీరోయిన్ మళ్లీ మారిందా.. ఇంతకీ రీజన్ ఏంటీ.. అందుకే నో  చెబుతున్నారా?Siddu jonnalagadda.. యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ ( Siddu jonnalagadda ) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎన్నో సినిమాలలో నటించి సరైన హిట్ లేక ఇటీవల డీజే టిల్లు సినిమాతో వచ్చి భారీ పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈయన నటిస్తున్న చిత్రం డీజే టిల్లు2.. ఈ సినిమాలో హీరోయిన్ పై స్పష్టత రాకపోవడం గమనార్హం. రోజుకో పేరు వినిపిస్తోంది. అసలు ఇంతమంది హీరోయిన్లు నో చెప్పడానికి అసలు కారణం సిద్దు నే అంటూ కూడా ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.

సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కిన డీజే.టిల్లు లో చిత్రానికి సూర్యదేవరనాగ వంశీ నిర్మాతగా సినిమాను నిర్మించారు. ఈ సినిమాకి అదిరిపోయే క్రేజ్ రావడంతో వెంటనే సీక్వెల్ ని కూడా ప్లాన్ చేశారు. షూటింగ్ కూడా మొదలుపెట్టారు కానీ పార్ట్ 2 లో చాలా మార్పులు చోటు చేసుకోవడం గమనార్హం. ముఖ్యంగా ఈ సినిమా కోసం హీరోయిన్ ఎంపిక చాలా కష్టంగా మారింది. ఇకపోతే ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల (Sree Leela) ను సంప్రదించగా ఆమెకు పెద్ద సినిమాలలో అవకాశాలు రావడంతో ఈ సినిమాను రిజెక్ట్ చేసింది.

ఆ తర్వాత మొదట హ్యాట్రిక్ అందుకున్న బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ (Anupama parameswaran) కూడా ఓకే చేసినట్టు వార్తలు వినిపించాయి. కానీ సిద్దు తో ఏర్పడిన గొడవలు వల్లే ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు సమాచారం. కానీ ఆ తర్వాత మడోన్నా సెబాస్టియన్ (Madonna Sebastian) ను కూడా తీసుకొచ్చారు. హీరోయిన్గా ఈమెకు మంచి గుర్తింపు లభిస్తుందని అందరూ అనుకున్నారు . కానీ ఇటీవల ఈమెకు స్క్రీన్ టెస్ట్ చేయడంతో ఆమె సెట్ కాలేదు. అందుకే ఆమెను కూడా ఈ సినిమా నుంచి తొలగించినట్లు సమాచారం. కానీ ఇప్పుడు మీనాక్షి (Meenakshi) పేరు వినిపిస్తోంది. కనీసం ఈమైనా ఫైనల్ వరకు వెళ్తుందా షూటింగ్లో పాల్గొంటుందా అనేది వైరల్ అవుతుంది.

ఇంతమంది హీరోయిన్లు సిద్దు జొన్నలగడ్డ సినిమాకు నో చెప్పడానికి కారణం అతడి ప్రవర్తనను తట్టుకోలేకపోతున్నారట. సిద్దుతో హీరోయిన్లకు సెట్ కావడం లేదని, అతడు చాలా ఇబ్బంది పెడుతున్నాడని అందుకే వారు నో చెబుతున్నారని వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో చెక్కర్లు కొడుతుంది. మరి మీనాక్షి నైనా ఈ సినిమాకు ఫైనల్ అవుతుందో లేదో చూడాలి.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *