Srikanth Family Photos - DSLR GuruRoshan Meka: టాలీవుడ్ లో ఒకప్పటి హీరోలలో చాలా సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న వారిలో హీరో శ్రీకాంత్ (Sreekanth) కూడా ఒకరు. ఆయన నటించిన కుటుంబ కథ చిత్రాలు చాలా పాపులారిటీ ని సంపాదించి పెట్టాయి శ్రీకాంత్ కి.. ఆ తరువాత శ్రీకాంత్ సినీ ఇండస్ట్రీకి చెందిన నటి ఊహను వివాహం చేసుకోగా వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు జన్మించారు. అతని కొడుకు రోహన్ (Rohan) సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే .

మొదటగా “నిర్మల కాన్వెంట్”సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. కానీ ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.ఆ తరువాత ఈ మధ్యకాలంలో “పెళ్లి సందD” సినిమాతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.అంతేకాదు రోషన్ బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించి సూపర్ హిట్ అయిన “దబాంగ్ త్రీ”సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సంగతి చాలామందికి తెలియకపోవచ్చు. ఒక టాలీవుడ్ హీరో తనయుడు బాలీవుడ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేయటం అంటే నమ్మలేని నిజం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోహన్ ఎన్నో విషయాలను మీడియాతో పంచుకున్నారు..

రోహన్ మాట్లాడుతూ..” ఒక సౌత్ ఇండియన్ ని అని చెప్తే ఎవరు నమ్మేవారు కాదు. సౌత్ ఇండియాలో నాలాంటి వాళ్లు చాలామంది ఉంటారు. అని నేను చెప్తూ ఉండేవాడిని. అక్కడ చూసిన వాళ్లందరూ నన్ను హృతిక్ రోషన్ ల ఉంటావని అనేవాళ్లు” అంటూ చెప్పుకొచ్చారు రోహన్. ఇకపోతే గత కొన్ని నెలల కిందట శ్రీకాంత్ రెండో కొడుకు రోహన్ కూడా ఇండస్ట్రీకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నాడని చెప్పారు.

ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా దర్శకత్వంలో రోహన్ మొదటి సినిమా ఉంటుందని ఆ సినిమా గురించి కొన్ని వివరాలు త్వరలోనే విడుదల కాబోతున్నాయని తెలియజేశారు రోషన్. కానీ ఇప్పటికీ ఆ వార్త బయటకి రాలేదు. ఇంతకు రోహన్ సినిమా స్టార్ట్ అయ్యిందా లేదా విడుదల ఎప్పుడు అవుతోంది అనే విషయాలు ఇంతవరకు ఏ మీడియా ద్వారా కూడా బయటకి తెలియలేదు. కానీ అభిమానులు మాత్రం రోహన్ (Rohan Meka) ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నారు.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *