Ranbeer Kapoor

Ranbeer Kapoor: బాలీవుడ్ లో స్టార్ హీరో హీరోయిన్స్ గా ఉన్న రన్బీర్ కపూర్,ఆలియా భట్ ఎన్నో రోజులుగా ప్రేమించుకుని ఈ ఏడాది ఏప్రిల్ లో పెళ్లి చేసుకున్నారు. ఇక వీరికి పెళ్లయిన రెండు నెలలకే గుడ్ న్యూస్ అంటూ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయంలో చాలామంది పెళ్లైన రెండు నెలలకే మూడో నెల ఎలా వస్తుంది అంటూ వీరిని విమర్శించారు. అలాగే గత నెలలో అలియా భట్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇక ఈ విషయంలో కూడా చాలామంది నెటిజన్స్ పెళ్లయిన ఏడు నెలలకే బిడ్డ పుట్టిందా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ఇలా వారి ప్రెగ్నెన్సీ,అలాగే పాప పుట్టినప్పుడు చాలామంది వీరిని విమర్శించారు. కానీ వాటిని పట్టించుకోకుండా వీళ్లు తమ బిడ్డతో కలిసి ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ విషయం పక్కన పెడితే..రణ్బీర్ కపూర్ (Ranbeer Kapoor) ఈమధ్యనే సౌత్ అరేబియాలో జరిగిన రెడ్ సి ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్నారు. ఇక ఈ ఈవెంట్లో రన్బీర్ కపూర్ తన సినిమాల గురించి మాత్రమే కాకుండా తన బిడ్డతో ఆయన అనుబంధం ఎలా ఉందో చెప్పుకొచ్చారు. అలాగే రన్బీర్ ని మీరు తండ్రి అయ్యాక మీలో ఎలాంటి మార్పులు వచ్చాయి అని మీడియా ప్రశ్నించగా..

దానికి రన్బీర్ మాట్లాడుతూ.. అసలు నాకు పెళ్లి ఇంతకుముందే ఎందుకు చేసుకోలేదా అని నాలో నాకే అనుమానం వచ్చింది. ఎందుకంటే ఇంకొంచెం యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటే నా పిల్లలతో నేను ఇంకా ఎక్కువ రోజులు గడిపే వాడిని.కానీ నాకు 60 ఏళ్లు వచ్చేవరకు నా పిల్లలకు 20 ఏళ్లు ఉంటాయి.అలాంటి టైం లో నేను వారితో కనీసం ఫుట్బాల్ కూడా ఆడలేను. వారితో కలిసి ఎంజాయ్ చేయలేను. అందుకే పెళ్లి విషయంలో ఇంకొంచెం ముందే చేసుకుంటే బాగుండు అని నాకు అనిపించింది.

ప్రస్తుతం ఆలియా నేను నా బిడ్డతో ఎన్నో స్పెషల్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తున్నాము. అలాగే నాకంటే ఆలియా నా బిడ్డ విషయంలో చాలా బిజీ ఉంటుంది. అందుకే అలియాభట్(Aliya bhatt) సినిమా షూటింగ్ లో ఉన్నప్పుడు నా బిడ్డకు పూర్తి సమయాన్ని నేను కేటాయించాలని భావిస్తున్నాను అంటూ రణబీర్ కపూర్ (Ranbeer Kapoor)ఆ ఫిల్మ్ ఫెస్టివల్ లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం రన్బీర్ కపూర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *