పూరీ జగన్నాథ్ కోసం ఏమైనా చేస్తానంటున్న రమాప్రభ.. కారణం..? | ManalokamRama Prabha.. తెలుగు , తమిళ చిత్రాలలో సుమారుగా 1400కు పైగా సినిమాలలో నటించి తొలితరం హాస్య నటీమణీగా గుర్తింపు తెచ్చుకున్న రమాప్రభ (Ramaprabha) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగి హీరోయిన్లతో సమానంగా ఆస్తులను కూడబెట్టిన ఈమె.. ఒక హీరోని నమ్మి నిలువునా మోసపోయింది. 1966 నుండి 2015 వరకు నిర్విరామంగా సినిమాలలో నటించి.. మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె 2015లో వచ్చిన బెంగాల్ టైగర్ సినిమా వరకు ఎన్నో విజయవంతమైన చిత్రాలలో భాగస్వామ్యం అయింది. ముఖ్యంగా నిన్నటి తరం హీరోలతోనే కాదు నేటి తరం హీరోలతో కూడా కలిసి నటించింది.ఇకపోతే జీవితంలో అన్ని వందల సినిమాలలో నటించి కోట్ల ఆస్తిని కూడా పెట్టికున్న క్రమ ప్రభను ఒక వ్యక్తి మోసం చేసి ఆమెను నిలువునా దోచుకున్నాడు ఆమె ఆస్తి మొత్తాన్ని తన పేరుపైన రాసుకొని ఆమెను ఒంటరిని చేశాడు..

దీంతో దిక్కు దోచని పరిస్థితుల్లో ఉన్న ఈమెకు ప్రతినెల పూరి జగన్నాథ్ డబ్బులు ఆమె ఖాతాలో వేస్తున్నారట.ఈ విషయాన్ని అహిష్టంగానే మీడియాకు తెలిపింది రమాప్రభ.. ఒక ఇంటర్వ్యూలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. నేను నా జీవితంలో ఎవరికైనా రుణపడి ఉంటాను అంటే అది డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) కి మాత్రమే ఇప్పటికీ ఆయన సహాయం చేస్తూనే ఉన్నారు. ప్రతి నెల కొంత డబ్బు నా అకౌంట్ లో వేస్తున్నారు..

ఈ విషయం తెలుసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది అంటూ జరిగిన విషయాన్ని తెలియజేసింది రమా ప్రభ.దానాల్లో గుప్తదానం అని ఒకటి ఉంటుంది. స్టేజ్ మీద ఇవ్వడం అనేది ఒకటైతే .. ఇచ్చినట్టే ఇచ్చి తీసినట్టు తీసుకునే వాళ్ళు ఉన్నారు. బద్రి సినిమా నుంచి దర్శకుడు పూరీ బాబుతో అనుబంధం ఉంది. ఇది జన్మజన్మల బంధంగా భావిస్తుంటాను. ఆ బాబానే నాకు ఈ బంధం ఏర్పరిచారని అనుకుంటాను.

ఒకరోజు నేను గుర్తున్నానా అని పూరీ బాబూ ను అడిగాను. అయితే నీ పుట్టినరోజు ఎప్పుడు అని పూరి బాబు అడిగారు. మే 5 అని చెప్పడంతో ఆ తర్వాత నుండి ప్రతినెల ఐదు లోపు నా అకౌంట్ లో డబ్బులు పడిపోతాయి అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది. ఎవరికి ఎవరో అన్నట్టు ఉండే ఈ కాలంలో కూడా ఎవరో తెలియని నాకు డబ్బులు వేస్తున్నాడు అంటే నిజంగా జీవితాంతం నేను ఆయనకి రుణపడి ఉంటాను అని తెలిపింది రమాప్రభ.

    Click here for follow Pakkafilmy in Google news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *