Mahesh Babu

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటశేఖరుడిగా పేరు తెచ్చుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఈ మధ్యనే అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. ఈయన మరణంతో తెలుగు సినిమా ఇండస్ట్రీ తో పాటు ఇతర భాష ఇండస్ట్రీ లు కూడా ఒక మంచి నటుడిని కోల్పోయామంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక కృష్ణ(krishna) వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి మహేష్ బాబు ఎంట్రీ ఇచ్చి తండ్రి కి తగ్గ తనయుడుగా పేరు తెచ్చుకున్నారు. ఇక మహేష్ బాబు తన తండ్రి తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించారు. ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు.

ఇక ఈ విషయం పక్కన పెడితే చాలా మంది మహేష్ బాబు( Mahesh Babu)అంటే పడని వాళ్ళు మహేష్ బాబు కు బట్టతల ఉందంటూ సోషల్ మీడియా వేదికగా ఎన్నో ఫోటోలు షేర్ చేశారు. అయితే ఇందులో ఎంతవరకు నిజముందో ఇప్పుడు తెలుసుకుందాం. మహేష్ బాబుకి వాస్తవానికి జుట్టు చాలా ఒత్తుగా ఉండేది.కానీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాక సినిమాల్లో ఆయన హెయిర్ స్టైల్ బాగా కనిపించడానికి ఆయన జుట్టుపై ఏవేవో హెయిర్ స్ప్రేలు చేసేవారట. ఇక ఆ కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల మహేష్ బాబు లో జుట్టు పెరగడం చాలా వరకు తగ్గిపోయిందట. కానీ ఆయన అతడు సినిమా వరకు ఒరిజినల్ జుట్టునే మైంటైన్ చేశాడు.

అయితే అప్పటివరకు ఈయన అన్ని సీరియస్ పాత్రల్లోనే నటించారు. కానీ మొదటిసారిగా పోకిరి(pokiri) సినిమా నుండి ఆయన కొంచెం కామెడీ అలాగే సీరియస్ హీరోగా మారిపోయారు.దాంతో ఆయన చేసే పాత్ర కి ఆయన జుట్టుకి ఏమాత్రం సెట్ కాదని హెయిర్ స్టైల్ లో చాలా మార్పులు తీసుకురావాలని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో పాటు ఆయన భార్య నమ్రత (namratha)కూడా అన్నారట. దీంతో మహేష్ బాబు చేసేదేమీ లేక భార్య చెప్పిన మాటలు విని హెయిర్ ట్రాన్సప్లాంటేషన్ చేయించుకున్నారట.

ఇక పోకిరి సినిమా నుండి కేవలం మహేష్ బాబు లుక్ లోనే కాకుండా హెయిర్ స్టైల్ విషయంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇక మనకు క్లారిటీగా తెలియాలంటే అతడు(athadu) సినిమాలో ఈయన ఫోటోని అలాగే పోకిరి సినిమాలో ఫోటోని రెండింటిని పక్క పక్కనే పెట్టుకొని కంపేర్ చేస్తే ఆయన హెయిర్ స్టైల్ విషయంలో స్పష్టత కనిపిస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చూపిస్తున్న విధంగా మహేష్ బాబు(Mahesh Babu) కి పూర్తిగా బట్టతల మాత్రం లేదు. ఆయనకు జుట్టు ఉంది. కానీ అది కాస్త పల్చగా ఉంది. అంతేగాని పూర్తిగా హెయిర్ లేకుండా ఏం లేదు. ఇక సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు అన్నీ ఫేక్.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *