Madhubala

Madhubala: అప్పట్లో దేశభక్తి నేపథ్యంలో వచ్చిన రోజా (roja) సినిమా అంటే అందరికీ గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ప్రతి ఇండిపెండెన్స్ డే కి,అలాగే రిపబ్లిక్ డే కి కచ్చితంగా టీవీలలో ప్రసారమవుతుంది. ఇక ఈ సినిమా విషయం చెప్పగానే మనకు ఇందులో ఉన్న హీరోయిన్ మధుబాల గుర్తుకు వస్తుంది. ఈ సినిమాలో మధుబాల నటనకు చాలామంది ఫిదా అయ్యారు. అంతేకాదు ఈ సినిమాలో వచ్చే “చిన్ని చిన్ని ఆశ చిన్నదాని ఆశ ” అనే పాట అప్పట్లో ఎంత ఫేమస్ అయిందో మనకు తెలుసు.

అంతేకాదు ఆ పాట ఇప్పటికి కూడా ఎవర్గ్రీన్ పాట. ఇక హీరోయిన్ మధుబాల అప్పట్లో ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించి తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు అందం విషయంలో ఏకంగా ఐశ్వర్య రాయ్ (aishwarya ray) తోనే పోటీపడిన ఏకైక హీరోయిన్ మధుబాల అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. హీరోయిన్ మధుబాల అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి ఆ తర్వాత అవకాశాలు తగ్గడంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసింది. ఇక ఈ విషయం పక్కన పెడితే..తాజాగా ప్రేమదేశం (prema desham) అనే సినిమాతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టబోతుంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మధుబాల ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. మీకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో అంటే బాగా ఇష్టం అని యాంకర్ అడగగా.. నాకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan) అంటే చాలా పిచ్చి. అలాగే ఈ జనరేషన్ హీరోలలో నాకు అక్కినేని నాగచైతన్య అంటే కూడా చాలా క్రేజ్ అని చెప్పింది. అలాగే తెలుగు హీరోయిన్స్ లో ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో ఎవరు ఇష్టం అని యాంకర్ అడగగా.. నాకు సహజంగా తన నటనతో మెప్పించే సాయి పల్లవి (sai pallavi) అంటే చాలా ఇష్టం అంటూ మధుబాల చెప్పింది.

అయితే మధుబాల (Madhubala) తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించనప్పటికి కూడా రెమ్యూనరేషన్ ని బాగానే డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయం పక్కన పెడితే.. మధుబాల ఆ ఇంటర్వ్యూ లో మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నీకు పెళ్లి అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం పోలేదా అంటూ చాలామంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

    Click here for follow Pakkafilmy in Google news

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *