Faima: ఫైమాకు గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పిన పటాస్‌ ప్రవీణ్‌.. ఖరీదైన కానుకతో  అదిరిపోయే సర్‌ప్రైజ్ | Bigg Boss Telugu 6: Patas Praveen welcomes Jabardasth  Faima with a Special gift ...Jabardasth Praveen..జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ప్రవీణ్ (Praveen) – ఫైమా (Faima) జంట భారీ పాపులారిటీని దక్కించుకున్న విషయం తెలిసిందే. నిజానికి వీరు పటాస్ షో ద్వారా పరిచయం ఏర్పరచుకున్నారు. అయితే జబర్దస్త్ (Jabardast)లోకి వచ్చిన తర్వాత వీరిద్దరికీ మంచి గుర్తింపు లభించింది.. ఇకపోతే ప్రవీణ్ తో పోల్చుకుంటే ఫైమాకి విపరీతమైన ఫాలోయింగ్ ఉందని చెప్పాలి . తన కామెడీ టైమింగ్ తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఈమె ఇటీవల బిగ్ బాస్ రియాల్టీ షోలో కూడా అవకాశాన్ని దక్కించుకుంది .

బిగ్ బాస్ (Bigboss6) సీజన్ సిక్స్ లో పాల్గొన్న తర్వాత మరింత క్రేజ్ పెరిగిందని చెప్పవచ్చు.హౌస్ లో ఉన్నంత సేపు చాలా చురుగ్గా.. అన్ని యాక్టివిటీస్ లో పాల్గొని.. అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా గట్టి పోటీ ఇచ్చింది. అలాగే చివరి వరకు ఏమాత్రం తగ్గకుండా తనను తాను ప్రూవ్ చేసుకొని నిలబడిన ఈమె ఎట్టకేలకు 13 వ వారానికి సంబంధించి ఎలిమినేషన్స్ లో ఫైమా ఎలిమినేట్ అయింది. ఇకపోతే బిగ్ బాస్ నుండి బయటకి రాగానే ఆమెకుఅభిమానులు ,కుటుంబ సభ్యులు, జబర్దస్త్ కార్తీక్ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. అయితే అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలలో ప్రవీణ్ కనిపించలేదు.

దీంతో టైటిల్ కప్పు గెలవలేదనే కోపంతో ప్రవీణ్ .. ఫైమాని దూరం పెడుతున్నాడా అంటూ వార్తలు కూడా వినిపించాయి.కానీ ఇప్పుడు ఫ్యామిలీ కంటే గ్రాండ్ వెల్కమ్ పలికాడు ఫైమా ప్రియుడు పటాస్ ప్రవీణ్.. పటాస్ నుండి ట్రావెల్ చేస్తున్నా.. జబర్దస్త్ లో ఆమెతో జోడి స్కిట్ చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇద్దరి మధ్య మంచి స్నేహం నుండి లవ్ ఏర్పడినట్లు వీరే స్వయంగా ప్రకటించారు.

ఇకపోతే ప్రవీణ్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెబుతూ తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ ని ఫైమాకి స్పెషల్ గిఫ్ట్ గా ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పైగా ప్రవీణ్ గిఫ్ట్ ఇచ్చిన వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో రిలీజ్ చేసింది ఫైమా.. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ గా మారుతోంది.ఫైమా, ప్రవీణ్ వివాహం ఎప్పుడు చేసుకుంటారని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

 https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *