కేరళ కుట్టి పూర్ణ(poorna) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించే ఈ అమ్మడు 2004లో `మంజు పొలారు పెన్‌కుట్టీ` అనే సినిమాతో మాలీవుడ్‌కు పరిచయమైంది. ఆ తర్వాత శ్రీహరి హీరోగా నటించిన `శ్రీ మహాలక్ష్మి` చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది. తమిళంలోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న ఈ బ్యూటీ.. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన అవును, అవును 2 చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది.

ఈ సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో విమర్శకులు నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఆకట్టుకునే అందం, అంతకుమించి టాలెంట్ ఉన్న ఈ అమ్మడుకు తెలుగులో సరైన ఆఫర్లు తగ్గలేదు. ప్రస్తుతం ఈ బ్యూటీ విలన్ పాత్రలు, సహాయక పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. అలాగే బుల్లితెరపై పలు టీవీ షోలకు జడ్జ్ గా వ్యహరిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక రీసెంట్గా పూర్ణ వైవాహిక బంధం లోకి కూడా అడుగుపెట్టింది. దుబాయ్‌ వ్యాపారవేత్త, జేబీఎస్ గ్రూప్ కంపెనీ సీఈవో అయిన షానిద్ ఆసిఫ్ అలీ(Shanid Asif Ali)తో పూర్ణ వివాహం జ‌రిగింది.

దుబాయ్‌లో(dubai) కుటుంబ స‌భ్యులు, అత్యంత స‌న్నిహితుల న‌డుమ వీరి వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఈ ఏడాది పూర్ణ తనకు కాబోయేవాడిని పరిచయం చేసింది. కానీ, పెళ్లి విష‌యాన్ని మాత్రం బ‌య‌ట పెట్ట‌లేదు. దీంతో ఈమె పెళ్లి ఆగిపోయిందంటూ కూడా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల‌కు చెక్ పెడుతూ పెళ్లి ఫోటోల‌ను షేర్ చేసి అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేసింది.

ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు ఓవైపు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌ను, మ‌రోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతోంది. అలాగే సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అదిరిపోయే ఫోటో షూట్ల‌తో కుర్ర‌కారు మ‌తుల‌ను చెడ‌గొడుతోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ట్రెండ్ దుస్తుల‌ను ధ‌రించి అదిరిపోయే విధంగా ఫోటో షూట్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫోటోల‌కు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్న ప‌చ్చ‌గా కామెంట్స్ చేసింది. తన డ్రెస్సింగ్ పై మాట్లాడుతూ.. ఒకరిని మెప్పించడానికి నేను ఎప్పుడు బట్టలు ధరించను. స్టైల్ అండ్ కంఫర్ట్ మాత్రమే చూసుకుంటాను అని త‌న పోస్ట్ కింద రాసుకొచ్చింది. దీంతో పూర్ణ(poorna) కామెంట్స్ మ‌రియు తాజా పిక్స్ నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *