Yash : కన్నడ స్టార్ యశ్(kannada star yash) గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. య‌ష్ అస‌లు పేరు న‌వీన్ కుమార్ గౌడ‌. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా కన్నడ సినీ పరిశ్రమంలో అంచ‌లంచ‌లుగా ఎదుగుతూ స్టార్ హీరోగా ఎదిగిన యశ్.. ప్రశాంత్‌ నీల్ తెరకెక్కించిన `కేజీఎఫ్` సినిమాతో `రాఖి భాయ్` గా ప్రేక్షకుల మనసులో చెదిరిపోని ముద్ర వేసుకున్నాడు.

ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న యశ్‌కు.. ఈరోజు వెరీ వెరీ స్పెషల్. ఎందుకంటే ఈవేళ ఆయన పెళ్లి రోజు. యశ్ భార్య పేరు రాధికా పండిత్(radhika pandit). ఈమె కూడా ఒక నటి. వీరిద్దరూ తొలిసారి 2004లో `నంద గోకుల` అనే టీవీ సీరియల్ ద్వారా కలుసుకున్నారు. ఇద్దరూ ఇదే సీరియల్ ద్వారా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.

ఆపై నాలుగేళ్లకు ఇద్దరూ కలిసి `మొగ్గిన మనసు(moggina manasu)` సినిమాతో వెండితెరపై అడుగు పెట్టారు. ఆ త‌ర్వాత `డ్రామా` అనే సినిమాలో కలిసి నటించారు. ఇలా ఏళ్ల పాటు కలిసి పని చేయడం వల్ల వీరి స్నేహబంధం కాస్త దృఢ‌మైన ప్రేమగా మారింది. దాదాపు 8 ఏళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట 2016లో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. వివాహం అతికొద్ది మంది సమక్షంలో జరిగినా.. రిసెప్షన్ ను మాత్రం గ్రాండ్ గా నిర్వహించారు. అప్పట్లో వీరి పెళ్లి, రిసెప్షన్ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక వీరి ప్రేమకు గుర్తుగా 2018లో కూతురు ఐరా, ఆ మరుసటి ఏడాది కుమారుడు యథర్వ్ జ‌న్మించారు. అయితే నేటితో య‌శ్‌(yash), రాధికాల వివాహ బంధానికి ఆరేళ్లు. దీంతో య‌శ్ దంప‌తులు త‌మ పెళ్లి రోజు వేడుక‌ల‌ను ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అలాగే ఈ సంద‌ర్భంగా రాధికా పండిత్‌.. ఇన్‌స్టా భ‌ర్త య‌శ్‌తో క్లోజ్‌గా దిగిన కొన్ని ఫోటోల‌ను పోస్ట్ చేసింది. `ఈ ఆరేళ్ల వైవాహిక జీవితాన్ని మీతో మ్యాజికల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు. పెళ్లి రోజు శుభాకాంక్షలు. మిమ్మ‌ల్ని ఎప్ప‌టికీ ప్రేమిస్తూనే ఉంటాను` అని భ‌ర్త య‌శ్ ను ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసింది. దీంతో య‌శ్ దంప‌తుల‌కు అభిమానుల నెటిజన్లు విషెస్ తెలుపుతున్నారు.

https://www.instagram.com/p/Cl77GyOy9sB/?utm_source=ig_web_copy_link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *