Sridevi

Sridevi : తెలుగు చలనచిత్ర పరిశ్రమకి బాలనటిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత పదహారేళ్ల అమ్మాయి అనే సినిమాతో మొట్టమొదటగా హీరోయిన్ గా పరిచయమైంది అందాల తార అతిలోక సుందరి శ్రీదేవి. ఈ హీరోయిన్ చిన్నతనం నుండే ప్రేమానురాగాలకు దూరమై తల్లిదండ్రుల ప్రేమకు కూడా నోచుకోలేదు. శ్రీదేవి చిన్నతనం నుండే తనమీద ప్రేమ చూపించే వారి కోసం ఎదురుచూసేది. ఇక దాన్ని అలుసు గా తీసుకొని చాలామంది ఆమెను ప్రేమించినట్టుగా నటించి వారి కోరికలు తీర్చుకొని వదిలేసారు. వసంత కోకిల (Vasantha Kokila), ఆకలి రాజ్యం వంటి సినిమాల్లో నటించే టైంలో ఆమె కమలహాసన్ ప్రేమలో పడింది.

ఇక ఆ టైంలో కమలహాసన్ (Kamal hasan) కూడా శ్రీదేవిని ప్రేమిస్తున్నట్టుగా కనిపించేవాడు. కానీ అవసరం తీరిన తర్వాత శ్రీదేవి ని వదిలేశాడు. అలాగే ఆమె బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు మిథున్ చక్రవర్తి తో చాలా సినిమాల్లో నటించింది. అయితే అప్పటికే పెళ్లయిన మిథున్ చక్రవర్తి (Mithun chakravarthy) శ్రీదేవిని ప్రేమించి ఎఫైర్ పెట్టుకొని అవసరం తీరాక వదిలేసాడు. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని కొన్ని రోజులు కాపురం కూడా చేశారు. ఇక ఇలా వీరిద్దరూ శ్రీదేవిని వాడుకొని తమ కోరిక తీరాక వదిలేశారు. అయితే తెలుగులో యాంగ్రీ మ్యాన్ గా పేరు తెచ్చుకున్న రాజశేఖర్ కి శ్రీదేవిని ఇచ్చి పెళ్లి చేయాలని అప్పట్లో వాళ్ల కుటుంబ సభ్యులు భావించారట.

కానీ ఎమ్మెస్ పూర్తి అయ్యేవరకు పెళ్లి చేసుకోనని శ్రీదేవి చెప్పడం,అలాగే రాజశేఖర్ (Rajashekhar) తల్లిదండ్రులకు కూడా శ్రీదేవి ఇంటికోడలుగా రావడం ఇష్టం లేకపోవడంతో ఆ ప్రేమ కథ అక్కడితో ముగిసింది. శ్రీదేవి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంత బిజీగా ఉన్నా కూడా తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఇక ఆమె హిందీలో నటించే టైంలో కృష్ణ (Krishna) సినిమాలో ఆఫర్ ఉంటే మాత్రం అన్ని వదిలేసుకుని కృష్ణ సినిమాలో నటించడానికి వచ్చేది. ఇక అప్పట్లో శ్రీదేవిని మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు అని అడిగితే సిల్వర్ స్టార్ స్టాలిన్, అరవింద స్వామి (Aravinda swamy) అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పేది.

ఇక ఆ తర్వాత ఈమె బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అయినా బోనీ కపూర్ (Boni kapoor) ని పెళ్లి చేసుకుంది. కానీ బోని కపూర్ కి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం తెలిసినా కూడా శ్రీదేవి (Sridevi) పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక శ్రీదేవి 2018 దుబాయ్ లో అనుమానాస్పదంగా మృతి చెందింది. ఇక ఈమె ఎలా మరణించారో అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇలా తన అంద చందాలతో సౌత్ ఇండస్ట్రీ ని అలాగే నార్త్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన అందాల తార శ్రీదేవిని ఇలా చాలామంది హీరోలు ప్రేమ పేరు చెప్పి వాడుకొని తమ అవసరం తీరాక వదిలేసారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *