Sonu Sood : సోనూసూద్(Sonu Sood) అంటే తెలియని వారుండరు. సామాన్యుల నుంచి సినీ ప్రియుల వరకు అందరికీ సోనూసూద్ సుపరిచితమే. కరోనా మహమ్మారి విలయ తాండవం చేసిన సమయంలో సోనూసూద్ వేలాది మందికి సహాయపడ్డారు. అంద‌రు క‌రోనాకు భ‌య‌ప‌డి ఇళ్ల‌ల్లోనే ఉంటే.. సోనూసూద్ మాత్రం వ‌ల‌స కార్మికుల‌కు, విదేశాల్లో చిక్కుకుపోయిన విద్యార్థుల‌కు త‌న సొంత ఖ‌ర్చుతో వారి వారి ఇళ్ల‌కు చేర్చాడు.

ఆక్సిజ‌న్ లేక ప్రాణాలు విడుస్తున్న జ‌నాల కోసం ఆక్సిజ‌న్ ప్లాంట్స్ ఏర్పాటు చేశాడు. ఇలా ఎన్నో విధాలుగా జ‌నాల‌కు సేవ‌లు అందించాడు. సినిమాల్లో విలన్ పాత్రలు చేస్తూ స్టార్ హోదాను అందుకున్న సోనూసూద్‌.. నిజ జీవితంలో మాత్రం రియల్ హీరో అనిపించుకున్నాడు. కరోనా వైరస్(corona virus) కంట్రోల్ అయిన తర్వాత కూడా తన సేవా కార్యక్రమాలను ఆపలేదు.

నిస్సహాయ స్థితిలో ఉన్న వారు సాయం అంటే చాలు.. వారికి లేదు కాదు అనుకుండా తన వంతు సహాయం చేస్తూనే వస్తున్నాడు. ఈ క్రమంలోనే తన మంచి మనసుతో కోట్లాది మందిని తన అభిమానులుగా మార్చుకున్నాడు. ఈ సంగతి పక్కన పెడితే.. రీసెంట్ గా సోనూసూద్ ఓ లగ్జరీ కారును కొనుగోలు చేశాడు. బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు(bmw 7 series car)ను ఆయన సొంతం చేసుకున్నారు.

ఈ కారు ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే. అన్ని సౌకర్యాలతో కూడిన ఈ లగ్జరీ కారు విలువరు రూ. 1.73 కోట్లు అని తెలుస్తోంది. ఇక కొత్త కారు ముందు దిగిన ఫోటోలను సోనూసూద్ స్వ‌యంగా సోష‌ల్ మీడియా ద్వారా పంచుకున్నారు. కాగా, ఇప్ప‌టికే సోనూసూద్ గ్యారేజ్ లో చాలా ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. పోర్స్చే పనామెరా, ఆడీక్యూ 7(audi q7), మెర్సిడెజ్ బెంజ్ ఎంఎల్ క్లాస్ వంటి కార్లు ఉన్నాయి. తాజాగా వీటి చెంత బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా వ‌చ్చి చేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *