Director Sachin Baburao Sasane Accuses Marathi Actor Sayaji Shinde Of FraudSayaji Shinde… తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న షాయాజీ షిండే (Sayaji Shinde) గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పోకిరి సినిమాలో పోలీస్ పాత్రలో ఆయన చెప్పిన డైలాగు ఆయనకు మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన ఈయన సోలో, సీమటపాకాయ్, యముడికి మొగుడు, సుడిగాడుతో పాటూ పలు చిత్రాలలో నటించారు . తాజాగా ఆయనపై మరాఠీ చిత్ర నిర్మాణ సచిన్ ససన్ తీవ్ర ఆరోపణలు చేశారు . సినిమా నుంచి తప్పుకుని తనను మోసం చేశారు అంటూ ఆరోపించారు.

అసలు విషయంలోకి వెళితే .. మరాఠీ చిత్ర నిర్మాత సచిన్ ససన్ (Sachin sasan) తెరకెక్కిస్తున్న గిన్నాథ్ మూవీలో నటించడానికి షాయాజీ రూ.5 లక్షలు పారితోషకానికి సంతకం చేశారు. అయితే నిర్మాత సచిన్ నుంచి డబ్బులు కూడా తీసుకున్న తర్వాత సినిమాలలో నటించలేదు అని.. నవంబర్ 25, 26 తేదీలలో షూటింగ్ ప్రారంభం కావాల్సి ఉండగా షాయాజీ షిండే అందుబాటులో లేరని నిర్మాత తెలిపారు. ఆ తర్వాత 27న షూటింగ్ రోజు స్క్రిప్ట్ మార్చమని షాయాజీ కోరడంతో ఆశ్చర్యపోయానని చిత్ర నిర్మాత సచిన్ వెల్లడించారు.

అయితే అందుకు ఒప్పుకోకపోవడంతో ఆగ్రహించిన షాయాజీ సినిమా నుంచి తప్పుకోవడం జరిగింది. ఈ సినిమా ఆగిపోవడంతో తన ఫీజులు తిరిగి ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారట చిత్ర నిర్మాత సచిన్ . అయితే ఈ ప్రాజెక్టు కోసం వైదొలిగినందుకు పారితోషకం రూ.5 లక్షలతో పాటు అన్ని ఖర్చులు భరించి మొత్తం రూ.17 లక్షల చెల్లించాలని నిర్మాత కోరారు. అయితే తనకు డబ్బులు తిరిగి ఇవ్వకపోతే కచ్చితంగా నిర్మాతల మండలికి కంప్లైంట్ చేస్తానని కూడా బెదిరిస్తున్నారు సచిన్ ససన్..

మరి ఈ విషయంపై షాయాజీ షిండే ఏ విధంగా స్పందిస్తారో తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా నటించి మరింత పాపులారిటీని దక్కించుకున్న ఈయన కేవలం విలన్ పాత్రలే కాకుండా అప్పుడప్పుడు కామెడీ పాత్రలు కూడా చేసి ప్రేక్షకులను అలరించారు. తెలుగు , తమిళ్ భాష చిత్రాలలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఈయన మరి ఇలా వివాదంలో ఇరుక్కోవడంతో ఈ విషయం కాస్త ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

https://news.google.com/s/CBIw_NDY40Y?sceid=IN:te&sceid=IN:te&r=11&oc=1

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *